ఒక పక్క చంద్రబాబు భద్రత పై తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతుంది. భద్రత తగ్గించారని, జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుని కావాలని టార్గెట్ చేస్తుందని ఆరోపిస్తుంది. మరో పక్క, ఇదే విషయం పై చంద్రబాబు కూడా, ఇదే విషయం పై కోర్ట్ లో కూడా కేసు వేసారు. 2014కి ముందు తనకు ఏ భద్రత ఉందో, అదే భద్రత ఇవ్వాలని పిటీషన్ లో కోరారు. దీని పై వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో, నిన్న అనంతపురం పర్యటనలో చంద్రబాబు కాన్వాయ్ లని ఎస్కార్ట్ వాహనం బోల్తా పడి ప్రమాదానికి గురవ్వటంతో, అందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అయితే ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే, ఒక్కసారిగా షాక్ అయ్యి, అది ఎస్కార్ట్ వాహనం అని తెలియటంతో, ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

రెండు రోజుల పాటు చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్తుండగా , చంద్రబాబు కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనానికి, పెనుకొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించటానికి మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు పర్యటన ముగించుకున్న చంద్రబాబు, బుధవారం ఉదయం బెంగుళూరుకు బయళ్దేరారు. అక్కడ నుంచి విజయవాడ వచ్చారు. అయితే చంద్రబాబు బెంగుళూరు వెళ్తున్న సమయంలో, పెనుగొండ వద్ద, చంద్రబాబు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు వాహనం పెనుకొండ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రిజర్వు ఎఎస్‌ఐ రామాంజినేయులు, ఎఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్‌లకు గాయాలు కావటంతో, వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read