తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో మెంబెర్ పదవికి మామూలు డిమాండ్ కాదు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తరుణంలో, టిటిడి బోర్డులో చోటు కోసం అటు తెలంగాణా, ఇటు ఏపి రాష్ట్రాల్లో కూడా పోటీ తీవ్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు, అటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదుకోసం పైరవీలు కూడా నడుస్తున్నాయి. జగన్, కేసీఆర్ మధ్య ఎంతో స్నేహం ఉన్న నేపథ్యంలో టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం టీఆర్ఎస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి దాక చంద్రబాబు వద్ద తమ పప్పులు ఉడకకపోవటంతో, జగన్ వద్ద తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలంగాణాలో ఉన్న మంత్రుల ద్వారా సిఫారసు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, జగన్‌కు ఒక సిఫార్సు లేఖ రాశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో హుజూరాబాద్‌కు చెందిన తనకు బాగా పరిచయం ఉన్న, దొంత రమేష్‌ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని ఈటల సిఫార్సు లేఖ రాసారు. తిరుమలలోని శ్రీవారికి భక్తులకు 18 ఏళ్లుగా రమేష్ సేవ చేస్తున్నారని ఈటల తన లేఖలో పేర్కొన్నారు. స్వామి వారికి సేవ చెయ్యటంతో పాటు భక్తులకు సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని ఆ లేఖలో వివరించారు. మరి ఈ లేఖ పై జగన్ ఏ విధమైన నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. టీటీడీ బోర్డు కొత్త చైర్మన్, సభ్యులను త్వరలోనే జగన్ నియమిస్తారని సమాచారం. ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దాని పై వివాదం కూడా రేగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read