2014లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తే, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ తమ వెంటే ఉంటారని, భావించిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని కూడా లేకుండా చేసింది. అయితే, అక్కడ కేసీఆర్ వచ్చి హ్యాండ్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం చంద్రబాబు వచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైదరాబాద్ కు మించిన ధీటైన రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, 33 వేల ఎకరాలు సేకరించారు. ఒక్క గజం భూమి ఇవ్వటానికి గొడవ గొడవ చేసే ఈ రోజుల్లో, రైతులు కూడా అటు రాష్ట్రానికి, ఇటు తమ భవిష్యత్తు బాగుటుందని ముందుకు వచ్చి భూమి ఇచ్చారు. ఈ భూములు ఇవ్వకుండా, భూములు తగలబెట్టిన చరిత్ర కూడా చూసాం. ఎవరి రాజధాని అమరావతి అంటూ, ఏడ్చిన ఏడుపులు చూసాం. చంద్రబాబుని అమరావతి నిర్మాణం జరగనివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు. అమరావతి నిర్మాణం ఆపాలి అంటూ, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేయించారు. అందులో ఒకరు, జనసేన నాయకుడు బోలిసెట్టి కూడా ఉన్నారు. ఇవన్నీ దాటుకుని వచ్చేసరికి, 2018 అయ్యింది. అంటే చంద్రబాబుకి మిగిలిఉంది, ఏడాది సమయం.

ఆ ఏడాది సమయంలోనే అమరావతి అనేక నిర్మాణాలు జరిగాయి. తరువాత జగన్ వచ్చారు, అమరావతి మూడు ముక్కలు అయ్యింది. 15 నెలలు తరువాత కూడా, వైసీపీ, బీజేపీ, జనసేన, అమరావతి విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాయి. అమరావతిని భ్రమరావతి అంటూ, అమరావతి పై అనేక కుట్రలు చేసింది వైసీపీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసింది జనసేన. ఇప్పుడేమో, 5 ఏళ్ళలో ఎందుకు అమరావతి నిర్మాణం జరగలేదు, అది చంద్రబాబు తప్పు అంటున్నారు. ఆపింది వీళ్ళే, అడిగేది వీళ్ళే. చంద్రబాబు సిఆర్డీఏ చట్టంలో తప్పులు చేసారు కాబట్టి, జగన్ అవకాసంగా తీసుకున్నారని, పవన్ అంటున్నారు అంటే, మొత్తం చంద్రబాబే చేసాడు, జగన్ ది ఏమి తప్పు లేదు అన్నట్టు చెప్తున్నారు. ఇక బీజేపీ సంగతి చెప్పే పనే లేదు. ఇలా గతంలో అమరావతి పై నిరంతరం ఏడ్చిన వాళ్ళు, ఎంతో కొంత పని చేసిన చంద్రబాబు పైనే, ఇప్పటికీ ఏడుస్తున్నారు అంటే, వీళ్ళకు అమరావతి కంటే, చంద్రబాబు మీదే ద్వేషమే ఎక్కువలా ఉంది. ఏది ఏమైనా, ఈ కంపు కొట్టిన కుల రాజకీయాల్లో నష్టపోయింది మాత్రం, అమరావతి రైతులే.ఇందులో చంద్రబాబుకు పోయేది ఏమి ఉండదు అని, ఇప్పటికైనా ఆ మూడు పార్టీలు గ్రహిస్తే, అమరావతి రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read