కాలం చెల్లిన బీర్ల విక్రయాలతో మందుబాబుల ఆరోగ్యం గుల్లగుల్ల అవుతోంది. తయారు చేసిన బీర్లకు ఆరు నెలలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. అంతలోపే వాటిని వినియోగించాలి. అయితే క-రో-నా నేపథ్యంలో నాలుగు నెలలుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో కం-టో-న్మెం-ట్ జోన్ల మినహా అన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఎగబడి తమకు కావాల్సిన బీర్లను కొనుగోలు చేశారు. మద్యం ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో బీర్ కే ఎక్కువ డిమాండ్. అయితే అవసరాలకు అనుగుణంగా మద్యం సరఫరా లేకపోవడం, కొత్త కొత్త బ్రాండ్లు దుకాణాల్లో దర్శనమిస్తుండటంతో మద్యం ప్రియులు తప్పుకుంటున్నారు. పైగా చల్లటి వాతావరణంలో కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం ఎక్కువగా సాగడంతో మద్యం విక్రయాలు సన్నగిల్లాయి. దీంతో బీర్ల నిల్వలు పేరుకుపోయాయి. చీప్ లిక్కర్, విస్కీ బ్రాందీ విక్రయాలు బాగా పెరిగినప్పటికీ బీర్లను కొనుగోలు చేసే వారు తగ్గిపోయారు. దీంతో ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. దీన్ని సాకుగా చేసుకొని రంగంలోకి దిగిన మఫియా అక్రమ దందాకు తెరలేపారు.

బీర్లు తయారుచేసే కంపెనీలతో కుమ్మక్కై కాలం చెల్లిన బీర్లను దుకాణాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాటిళ్లపై కొత్త స్టిక్కర్లు అంటించి విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా కాలం చెల్లిన బీర్లను కొత్త బాటిళ్లతో కలిపి అమ్ముతున్నారు. వీటిని సేవిస్తే ఎంతటి బీరుబాబైనా అనేక రుగ్మతలకు లోను కావాల్సిందే. ప్రధానంగా వంటిపై దురద రావడం, దద్దుర్లు లేయడం, విరేచనాలు కావడం, వాంతులవ్వడం, కడుపులో, కళ్లు మంటగా ఉండటం ఇలా అనేక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా బేవరీస్ కంపెనీలు ఉత్పత్తి బీరు ఆరునెలలోనే వినియోగించాలి. ఒక వేల కాలం చెల్లింది అంటే ఆయా బీర్లను వినియోగంకు పనికి వస్తాయా లేదా అంటూ ల్యాబ్ టెస్టుకు పంపుతారు. ఒకవేళ అందులో సెడ్మెంట్ రాలేదంటే వాటిని మరో 10 రోజులు విక్రయంకు అనుమతిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ వార్తలు అధికం అవ్వటంతో, కాలం చెల్లిన వీటి అమ్మకాలను ప్రస్తుతం నిలిపివేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఒకవేళ దుకాణాల్లో ఉంటే కూడ వీటి విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read