ట్టిసీమ పరవళ్ళు... ఇక చాల మీ మొసలి కన్నీళ్ళు...

పట్టిసీమ ఒక చరిత్ర. నీటి యాజమాన్య చరిత్రలో ఇదొక రికార్డ్. కేవలం 13 వందల కోట్ల రూపాయలతో 8 వేల కోట్ల రూపాయల ఆదాయం సాధించిన ఘనత పట్టిసీమ ప్రాజెక్టుకు దక్కింది. ఇలాంటి చరిత్ర సృష్టించిన పట్టిసీమ జలవనరుల శాఖకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుముందస్తు చుపునకు, రైతులను ఆదుకోవాలన్న వారి లక్ష్యానికి ఒక నిదర్శనం. పట్టిసీమ ప్రాజెక్ట్ తో, కృష్ణా ఆయకట్టుకు నీరు వచ్చింది. దీంతో ఇక్కడ రైతులు పడుతున్న ఆందోళనకు చెక్ చెప్పినట్లు అయింది. కాదు. సమైఖ్యాంధ్ర ఉద్యమంలో రైతులు పడిన భయానికి సమాధానం దొరికింది. చంద్రబాబు ముందుచూపుతో పట్టిసీమ నిర్మాణంతో ఇక తెలంగాణా ప్రాంతం అవసరం ఇక్కడ రైతులకి లేదని నిరూపించింది. నిర్మాణం చేపట్టవచ్చని ముందుగానే తెలిస్తే అప్పడే కోరుకునేవారు. ఇప్పుడు మంచికో చెడుకో రాష్ట్రం విడిపోయింది. కాని పట్టిసీమ ప్రాజెక్ట్ నిర్మాణంలో నవ్యాంధ్రప్రదేశ్ కు , ముఖ్యంగా కృష్ణా ఆయకట్టుకు జీవితకాల కష్టం తీరింది. జలవనరుల శాఖామాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు కృషి ఫలించింది.

కాని కొందరు రాజకీయ నాయకులు దీనిని స్వార్ధంతో చూస్తున్నారు. ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉన్నాయని. అసలు నిర్మాణమే తప్పని అంటున్నారు. కానీ వాళ్ళంతా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ప్రాజెక్ట్ నిర్మాణంతో వచ్చిన ఫలితాలు చూడాలి. కనీస లెక్కలు తెలియకుండా ఏదో మీడియాలో పేరు కోసం... రాజకీయంగా ఎదగటం కోసం... ప్రజల్లో ఎదో సాధించామని చెప్పుకోవటం కోసం... లేని పోని ప్రకటనలు చేసి కృష్ణా డెల్లా రైతాంగాన్ని గందరగోళపరచవద్దని రైతుబిడ్డగా, రైతుగా చేతులేత్తి నమస్కరిస్తున్నాను. ఏ రాజకీయాలకు సంబంధంలేని కృష్ణా డెల్టా రైతుగా ఫలాలు అందుకున్న వాడిగా పట్టిసీమ ప్రాజెక్ట్ సాధించిన ఫలితాలను వివరిస్తున్నాను.

పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శినికతతో ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇరిగేషన్ అధికారులు అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వంద సంవత్సరాలకు పైగా లెక్కలు తీసుకుని పట్టిసీమ ప్రాజెక్ట్ ను రూపొందించారు. గోదావరి నదికి ఏటా దాదాపు 8 సార్లు వరదలు వస్తాయి. కనీసం 3వేల టి.ఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది. ఈ నీటిని ఒడిసి పట్టుకోవటానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల నేను పోలవరం సందర్శించినప్పుడు పనులు పూర్తి కావటానికి మరో రెండేళ్ళ పడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ లోపుగా గోదావరి నీటిని ఒడిసిపట్టుకోవటానికి రూపొందించిన ప్రాజెట్టే పట్టిసీమ ప్రణాళిక. అదే కృష్ణా డెల్లా రైతాంగానికి ఆయువపట్ట.

అయితే అంచనాలు తెలియని, పరిపాలన పై అవగాహన లేని, పాలన అంటే తెలియని కొంతమంది నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ఉపయోగం లేదని అసెంబ్లీలో కూడా అడ్డగోలు వాదనలు చేశారు. అయితే ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్ళే ముఖ్యమంత్రి చంద్రబాబు వారి మాటలను లెక్కపెట్టలేదు. పని చేసి రైతులకు మేలు చేయాలని దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా భావించారు. అందుకే ఆయన దార్శినికతతో జలవనరుల శాఖ ముందుకు అడుగులు వేస్తోంది. కృష్ణా జిల్లా, డోకిపర్రు గ్రామానికి చెందిన ఆదర్భ రైతు శ్రీ పురిటిపాటి వీరారెడ్డి కుమారుడు తండ్రి ద్వారా తాత పడిన కష్టాలు, నీటి ప్రాధ్యానతలు తెలిసిన రైతు బిడ్డగా మెగా కృష్ణారెడ్డి గారు సకాలంలో పట్టిసీమ ప్రాజెక్ట్ ను పూర్తి చేసినందుకు అభినందిస్తున్నాను.

ఇదిలా ఉండగా గన్నవరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్, దెందులూరు శాసన సభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ వారి వారి సొంత డబ్బుతో రైతులకు మోటార్లు, అందుకు అవసరమైన సామాగ్రి అందించడంతో పోలవరం కుడి కాలువ నుంచి వచ్చే నీటిని ఒడిసిపట్టకుంటున్న రైతాంగాన్ని మరియు మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లోని కొద్ది భాగం రైతాంగాన్ని అడిగితే ప్రాజెక్ట్ ప్రయోజనం ఏమిటో తెలుస్తుంది.

మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలిసారిగా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి ఆదర్శంగా నిలిచారు. కళ్ళ ముందు ప్రవహిస్తున్న పోలవరం కుడి కాలువే నిలువెత్తు సాక్ష్యం. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రైతులు, కౌలుదారులు, రైతు కూలీలు అందుకుంటున్న ప్రతిఫలాలే మొసలి కన్ళీ కారుస్తున్న వారీకి ధీటైన జవాబు.

ఇట్లు
ముక్కామల రామచంద్రరావు
కృష్ణా డెల్టా రైతు
రొయ్యూరు, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా
సెల్ : 9440674046

Advertisements

Advertisements

Latest Articles

Most Read