రాజధాని రైతులు మరోసారి కోర్ట్ ని ఆశ్రయించారు. తమకు ప్రతి ఏటా ప్రభుత్వం ఇవ్వాల్సిన కౌలను ఈ ఏడాది మే 1వ ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ రోజు వరకు కూడా తమ ఎకౌంటులో కౌలు జమ చేయలేదని రాజధాని రైతులు ఆందోళనలు వ్యక్త చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏడాది కోర్ట్ ను ఆశ్రయించిన తరువాతే వైసిపి ప్రభుత్వం తమకు కౌలు డబ్బులు ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపుగా 34 వేల ఎకరాలు ఇచ్చిన 27 మంది రైతులకు 300 కోట్ల రూపాయల కౌలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. ఈనెల అందరికి జమ చేస్తామని చెప్పినప్పటికీ ,ఇప్పటి వరకు ఇవ్వక పోవటంతో,రైతులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. ప్రతి ఏడాది కూడా ఇదే తంతు జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు. రాజధాని రైతు అయిన పోతినేని శ్రీనివాస రావు కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ పొలాల కౌలు ఆదాయం తప్పితే తమకు వేరే ఆదాయం లేదని, రాజధాని నిర్మాణం కోసమే ఈ పొలాలను ఇచ్చామని ,ఇది తప్పితే వేరే ఆదాయ మార్గం లేదని, కాని ప్రభుత్వం ఇలా ఎగ్గొట్టటం సరి కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయం పై ఈ రోజు కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి

Advertisements

Advertisements

Latest Articles

Most Read