ఫెడరల్ ఫ్రంట్, దేశం, రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు అంటూ రెండు రోజుల క్రితం జగన్, కేటీఆర్ కలిసి ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారో విన్నాం. మేమే ఈ దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం అంటూ హడావిడి చేసారు. కేసీఆర్ ఈ దేశానికి మరో గాంధీ అన్నట్టుగా, జగన్ భజన చేసారు. అయితే, కేసీఆర్ రంగు ఒక్క ఫోన్ కాల్ తో బయట పడింది. ఈ రోజు కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు ‘యునైటెడ్ ఇండియా’ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోల్ కతాలో రేపు నిర్వహించే ర్యాలీకి మమతా బెనర్జీ ఆహ్వానించారు. రేపు నిర్వహించనున్న ర్యాలీలో ఎన్డీయేతర పార్టీల నేతలు పాల్గొననున్నారు. అయితే ఈ భేటీకి కేసీఆర్ రావటం లేదని, మమతాకో ఎవో కారణాలు చెప్పి తప్పించుకునట్టు తెలుస్తుంది. అయితే, తన పార్టీ తరుపున ఒక ప్రతినిధిని కూడా అక్కడకు పంపించేందుకు కేసీఆర్ భయపడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఢిల్లీ మోడీ, సహారా ఫైల్ బయటకు తీస్తాడని. ఇక్కడ మాత్రం, ఎన్నో కబురులు చెప్తున్న కేసీఆర్, ఇలా ఒక్క ఫోన్ కాల్ తో, తన బండారం బయట పెట్టుకున్నాడు.

jagan 1801200019

మరో పక్క, టీడీపీ అధినేత అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కోల్ కతా వెళ్లి ర్యాలీలో పాల్గొంటారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా సభకు హాజరవుతున్నప్పటికీ చంద్రబాబే ఆ సభలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. చంద్రబాబుకు మమత రెండు సార్లు ఫోన్ చేసి ర్యాలీకి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. పార్టీ నేతలు మంత్రులు కూడా ర్యాలీకి వెళితేనే బావుంటుందని చంద్రబాబుకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మమతా బెనర్జీ మొదటి నుంచి ప్రతిఘటించడం, ఎపీలో సీబీఐకి అనుమతిని రద్దు చేసిన వెంటనే కోల్ కతాలో కూడా అక్కడి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయమే తీసుకోవడం వంటి అంశాలతో పాటు భావసారూప్యత కూడా ఉండటంతో ర్యాలీకి వెళితేనే బాగుంటుందని నేతలు సూచించడంతో సీఎం కూడా వారి వాదనతో ఏకీభవించారు.

jagan 1801200019

కాంగ్రెస్ తరపున సోనియా, రాహుల్ ఇద్దరూ హాజరవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో సోనియా రాకపోయినా రాహుల్ ఖచితంగా వస్తారని నమ్మారు. అయితే రాహుల్ కూడా రావడం లేదు. పార్టీ తరపున లోక్ సభా పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే కోల్ కతా ర్యాలీకి వెళ్తున్నారు. జేడీఎస్ తరపున దేవె గౌడ, కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీపీ నేత శరద్ పవార్, ఆర్జేడీ తరపున తేజస్వీ యాదవ్, పాటిదార్ ఉద్యమకారుడు హార్డిక్ పటేల్ ఇలా అనేక మంది హాజరవుతున్నారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రతినిధిగా సతీష్ చంద్ర మిశ్రా ఈ ర్యాలీకి హాజరవుతారు. ఇక బీజేపీకి దూరంగా ఉంటున్న యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, శత్రుఘ్న సిన్హా ఇలా ఇలా స్టేజీపైనే భారీ రాజకీయ తారాగణం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అజిత సింగ్, శరద్ యాదవ్ లాంటి నేతలు కూడా ర్యాలీలో ఉంటారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీంటిని ఒకతాటిపైకి తీసుకురావడమే మమత ధ్యేయం. అందుకే అందరు నేతలను ఆమె వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటడం కూడా ముఖ్యమేనని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read