23 ఎంపీలు ఉండటం అంటే మామూలు విషయం కాదు. చాలా బలమైన పక్షంగా, వైసిపీ రాష్ట్రం తరుపున పోరాడి, కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. అయితే ఎందుకో కాని, కేంద్రం పై ఒత్తిడి తేవటంలో, అధికార వైసీపీ పూర్తీ విఫలం చెందుతుంది. అధిక నిధులు సంగతి తరువాత, కేంద్రం పెడుతున్న కొర్రీలతో, ఇవ్వాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వటం లేదు. మేము చేసే ప్రతిప పనిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, విజయసాయి రెడ్డి చెప్తున్నా, ఆచరణలో మాత్రం, కేంద్రం నుంచి ఏమి రావటం లేదు. తాజగా పోలవరం విషయంలో, చంద్రబాబు హయాంలో ఖర్చు పెట్టిన 5,486 కోట్లు రావాల్సి ఉంది. అయితే, మూడు వేల కోట్లు ఇవ్వటానికి కేంద్రం అంగీకారం తెలిపింది అని చెప్పారు. చివరకు, ఆర్ధిక శాఖ రూ.1,850 కోట్లను విడుదల చేసింది అని చెప్పారు. అయితే, అవి ఎన్ని రోజులు అయినా రాష్ట్రానికి మాత్రం రాలేదు. అసలు విషయం ఏమిటా అని, రాష్ట్ర అధికారులు ఆరా తీయగా, అక్కడ నుంచి వచ్చిన సమాధానం విని అవాక్కవ్వాల్సిన పరిస్థితి.

polavaram 17112019 2

రూ.1,850 కోట్ల గురించి ఆరా తీయగా, కేంద్ర ఆర్థిక శాఖ ‘ఆఫీసు మెమొరాండం’లో ప్రస్తావించిన నిబంధనల గురించి తెలిసి రాష్ట్ర ప్రభుత్వం అవాక్కయ్యింది. ఇలాగైతే, అసలు పోలవరం ఖర్చుల కోసం, కేంద్రం నుంచి రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని, తల పట్టుకుంటుంది. 2014కి ముందు వరకు చేసిన ఖర్చుల ఆడిట్ రిపోర్ట్ అడుగుతున్నారు. అలాగే, ఇప్పటి వరకు జరిపిన చెల్లింపులలో, ఎలాంటి అవినీతి జరగలేదు అని , నిపుణుల కమిటీ చెప్తేనే, తరువాత నిధులు విడుదల చేసే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఇందులో అప్పటి ప్రతిపక్షం వైసిపీ పాత్ర కూడా లేకపోలేదు. అప్పట్లో, అవినీతి జరిగిపోయింది అంటూ, హడావిడి చేసి, ఉత్తరాలు రాసి, అది ఎంక్వయిరీ దాకా వెళ్ళేలా చేసారు. ఇప్పుడు అది తేలే దాకా, రాష్ట్రానికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.

polavaram 17112019 3

ఇప్పటి ఖర్చులు ఎలాగైనా ఆడిట్ చేస్తారు. కాని 2014కి ముందు వివరాలు అంటే, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన జలయజ్ఞం అందరికీ తెలిసిందే. మరి అప్పటి రికార్డులు అన్నీ సరిగ్గా ఉన్నాయా, లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సోది కోసం వెళ్తే, పాత విషయాలు అన్నీ బయటకు వచ్చినట్టు, ఇప్పుడు ఇదో కొత్త చిక్కు. మొత్తానికి, ఈ నెల 8న ఆర్థిక శాఖ, జలశక్తి శాఖకు పంపిన ‘ఆఫీసు మెమొరాండం’లో, పోలవరం నిధుల పై స్పష్టత ఇచ్చారు. రూ.1,850 కోట్లుకు అనుమతి ఇచ్చాం కాని, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఆడిట్ జరగాలి. అలాగే నిధులు విడుదల చెయ్యాలంటే, 2014 దాకా చేసిన లెక్క చెప్పాలి అని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. మొత్తానికి కేంద్రం పెడుతున్న తాజా కొర్రీలతో, పోలవరం ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళే అవకాసం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం, సొంత ఖర్చులతో చేస్తుందా అంటే, నవరత్నాలకు, జీతాలకే, వెతుక్కునే పరిస్థితి. చూద్దాం జగన్ గారు ఏమి చేస్తారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read