గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద శనివారం పొద్దు పోయాక, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ మంటలు ఎలా అందుకున్నాయి, లాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పట్టిసీమ ప్రాజెక్ట్ వద్దకు మంటలు వ్యాపించక పోవటంతో, పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే, పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా తగలబడేది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు విద్యుత్‌ సరఫరా చేయడానికి, ప్రాజెక్ట్ పక్కనే పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ లో మూడు పెద్ద పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఈ ఒక్కొక్క ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ 220 కె.విగా ఉంటుంది. అయితే శనివారం అందులో ఒకటో నెంబర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. మంటలు వ్యాపించాయి అని తెలియగానే, పోలవరం ఎస్‌ఐ ఆర్‌.శ్రీను సంఘటనా స్తాలనికి చేరుకుని సబ్‌ స్టేషన్‌ వద్ద ఉన్న వాటర్‌ ట్యాంకర్ల ద్వారా, అక్కడ అంటుకున్న భారీ మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు.

pattiseema 15122019 2

అయితే, ఫైర్ ఇంజిన్ రావటానికి సుమార్కు గంట సేపు పట్టటంతో, మిగతా ట్రాన్స్‌ఫార్మర్‌లకు కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అందరూ భావించారు. అయితే, ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక కేంద్రం,పోలవరం ప్రాజెక్ట్ ఏరియాకి 30 కిమీ దూరంలోని, కొవ్వూరులో ఉండటంతో వాహనం రావడం ఆలస్యమైంది. దీంతో మొదటి ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా దగ్ధమైంది. ఈ భారీ ప్రమాదం చూసిన, చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటికీ పోలవరంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం గమనార్హం. ఎలాంటి ప్రమాదం జరిగినా 30 కిమీ నుంచి ఫైర్ ఇంజిన్ రావాలి.

pattiseema 15122019 3

అయితే మంటలు ఎలా వచ్చాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుండి నీటి విడుదలను గత 15 రోజుల క్రితం ఆపేశారు ఆపివేశారు. ఆపేసిన ప్రాజెక్ట్ లో ఎందుకు ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది అనే విషయం పై మాత్రం, ఇప్పటి వరకూ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. అధికారులు క్లారిటీ ఇస్తే కాని, జరిగిన విషయం పై ఒక అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగక పోవటం, అలాగే పట్టిసీమ ప్రాజెక్ట్ ఏరియాలోకి మంటలు రాకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశంలోనే మొదటి నదుల అనుసంధానం, పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వార జరిగిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయంలో కట్టిన ఈ ప్రాజెక్ట్, కృష్ణా డెల్టా రైతులకు వరప్రదాయనిగా ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read