వైసీపీ పార్టీ చేస్తున్న గడగడపకూ కార్యక్రమంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురు అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే వారి పరిధిలోని ఓటర్ల ఇళ్ళకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా, ఇళ్ళకు వెళ్తున్న వారిని, ప్రజలు అనేక సమస్యల పై నిలదీస్తూ, చుక్కలు చూపిస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక, వారి తిట్లు వినలేక, వైసీపీ ఎమ్మెల్యే సతమతం అవుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఎమ్మేలే గ్రంధి శ్రీనివాస్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. ఆయన ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో, ఒక మహిళ ఇటీవల పెంచిన కరెంటు బిల్లులు గురించి ప్రస్తావించింది. కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని తగ్గించాలని ఎమ్మెల్యేని కోరింది. అయితే దీని పైన ఎమ్మెల్యే ఆ మహిళను సముదాయిస్తూ చెప్పిన సమాధానంతో, ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రాష్ట్రంలో పెంచిన కరెంటు చార్జీలకు కారణం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అని చెప్పుకొచ్చారు. అక్కడ నుంచి మనకు బొగ్గు వస్తుందని, ఆ బొగ్గు సరఫరా ఇప్పుడు ఆగిపోవటంతో, వాటి కొనుగోలు వేరే చోటు నుంచి చేయాల్సి వచ్చిందని, అందుకే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్లే, ఇలా కరెంటు చార్జీలు పెంచాల్సి వచ్చింది అంటూ, దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు.

gadpagadapaku 18052022 2

అయితే ఇదే అంశం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో, ఆ వీడియో వైరల్ అయ్యింది. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేల మాటలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయం మోడీకి ఇంకా తెలియదని, ఇలా కూడా చెప్పొచ్చు అని తెలిస్తే, మోడీ కూడా ఇదే ప్రచారం చేస్తారు అంటూ, నార్త్ ఇండియా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, తమ అసమర్ధతను కప్పి పుచ్చికోవటానికి, ఇలా యుద్ధం పైన తోసేసారు. అసలు మనం ఎప్పుడూ కూడా రష్యా నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్న దాఖలాలు లేవు. జగన్ మోహన్ రెడ్డి ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచితే, ఆ విషయం ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించి, ఇలా అమాయకపు జనాలను, యుద్ధం వచ్చిందని, అందుకే ఇలా కరెంటు చార్జీలు పెరిగాయని మాయ చేస్తున్నారు. నిన్నటి వరకు, కరోనా సాకు చూపించిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు యుద్ధం సాకు చూపి, ప్రజల్లో తన అసమర్ధతను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు లాగా కనిపిస్తున్నారు మరి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read