ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పై అనుకున్నంత స్థాయిలో ఆక్టివ్ గా లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా, ఇదేమి పెద్ద రోగం కాదు, ఇది ఒక జ్వరం లాంటిది, కేవలం పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అంటూ, చాలా లైట్ గా చెప్పిన విషయం తెలిసిందే. దేశం అంతా లాక్ డౌన్ ఉంది కాబట్టి, ఈ మాత్రం చర్యలు అయినా ఉన్నాయి కాని, లేకపోతే, కరోనా పై ఏపి ప్రభుత్వం నుంచి, ఏమి ఆశించలేము అనే విమర్శలు వస్తున్నాయి. మరో పక్క ప్రధాన ప్రతిపక్షం, సూచనలు, సలహాలు ఇస్తున్నా, వారి పైనే మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, విసుగు చెందిన విజయవాడ తూర్పు ఎమ్మల్యే గద్దె రామ్మోహన్ తానే స్వయంగా రంగంలోకి దిగారు. సొంత ఖర్చులతో, విజయవాడ తూర్పు నియోజకవర్గం మొత్తం, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. తన సొంత ట్రాక్టర్లు ద్వారా ఈ పని చేసారు. అయితే ఇదే విధంగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టారు. తనకు ప్రభుత్వం తరుపున సహాయం అందిస్తే, విజయవాడ అంతటా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని 24 గంటల్లో, పిచికారీ చేయిస్తానని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, "ప్రభుత్వం సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తాను. అగ్నిమాపక యంత్రాలు సమకూర్చిస్తే కేవలం ఒక్క రోజులో నగరమంతా ద్రావణం చల్లించగలను. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడగడం తోపాటు సోడియం హైపో క్లోరైడ్ వీధుల్లో చల్లితేనె కరోనా మహమ్మారి నుంచి బయటపడగలం. ఈ ద్రావణం ప్రాముఖ్యత తెలియడం వల్ల సొంత నిధులు, సొంత వాహనాలతో 21వ డివిజన్ లో చల్లిస్తున్నాను. కరోనా విపత్కర పరిస్థితులలో పరిపాలనా ధక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేక పోయింది. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే చంద్రబాబు సలహాలు తీసుకున్నా ఎంతో బాగుండేది."

"ఎలాంటి అంటు రోగాలు ప్రభల కుండా పుష్కరాలు నిర్వహించిన సమర్ధవంతమైన నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వం కరోనా పై యుద్ధం చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం పనిగా పెట్టుకుంది. చంద్రబాబుని విమర్శించే స్థాయి ప్రభుత్వంలో ఎవరికీ లేదు. కరోనా తో దేశం తల్లడిల్లు పోతుంటే జగన్ సర్కార్ తమ అనుయావులకు రూ. 6,500 కోట్లు కాంట్రాక్టు ఇచ్చి పెద్దకుంభకోణంకి తెర తీసింది." అని అన్నారు. అయితే ప్రభుత్వం ఎక్కువగా, ఇసుక కలిపిన బ్లీచింగ్ పౌడర్ మాత్రమే చల్లుతుంది. ఎక్కడైతే కేసులు వస్తున్నాయో, ఆ ఏరియాలోనే సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా, అన్ని ప్రదేశాల్లో, బ్లీచింగ్ కాకుండా, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలని విపక్షం కోరుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read