రాజధాని తరలింపు వల్ల ఇప్పటికే అమరావతికేంద్రంగా అభివృద్ధికోసం వెచ్చించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సొమ్మంతా వృథా అవుతోందని, రాజధానికోసం పోరాడుతున్న వారిపై నక్సలైట్లు, టెర్రరిస్టులపై పెట్టిన కేసులు పెట్టారని, రాజధాని తరలింపు పేరుతో రాష్ట్రంలో అధికారపార్టీ సాగిస్తున్న అరాచకాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని టీడీపీ లోక్‌సభసభ్యులు గల్లా జయదేవ్‌ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన తోటిఎంపీలు రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిలతో కలిసి, మంగళగి రిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులకు ఏం న్యాయంచేస్తారో, ఎలా చేస్తారో, గతప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలకు ఎలా న్యాయం చేస్తారో జగన్‌సర్కారు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు రాజధానిని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్‌రెడ్డి, గతంలో రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని, అందుకు 30వేల ఎకరాలైనా కావాలని ఎందుకు చెప్పాడని గల్లా ప్రశ్నించారు. 2014లో విభజనబిల్లుపై చర్చజరిగేటప్పుడు, అసెంబ్లీలో జగన్‌ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు నన్నారు. ఎన్నికలప్రచారంలోకానీ, మేనిఫెస్టోలోగానీ జగన్‌, ఆయనపార్టీసభ్యులు రాజధానిని మారుస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

రివర్స్‌టెండర్లు, అవినీతి పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ ఆపేశారని, తద్వారా రాష్ట్రపురోగతి నిలిచిపోయిందన్నా రు. జీ.ఎన్‌.రావు, బీసీజీ కమిటీల రిపోర్టులు రాకముందే జగన్‌, తన నిర్ణయాన్ని వెల్లడించాడని, అలాంటప్పుడు ఆ కమిటీలకు విశ్వసనీయత ఎలా ఉంటుందని జయదే వ్‌ ప్రశ్నించారు. న్యాయస్థానాలుకూడా ఆయా కమిటీల నివేదికల్ని తప్పుపట్టాయని, చెన్నైఐఐటీ వారు అమరావతి ముంపుకు సంబంధించి ఏదో నివేదిక ఇచ్చారనికూడా దుష్ప్రచారం చేశారన్నారు. తాను రాళ్లేశానని తనపై కేసుపెట్టారని, నేనుకానీ, నాతో వచ్చినవారుకానీ రాళ్లేయలేదని, సివిల్‌దుస్తుల్లో ఉన్న పోలీసులే ఆపనిచేశారని గల్లా స్పష్టంచేశారు. పోలీసువారే ఒకకుట్రప్రకారం రాళ్లేసి, దాన్నిసాకుగాచూపి, కొట్టారని, పోలీసులు కొడతారన్న అనుమానంతో మహిళలంతా తనచుట్టూచేరి రక్షణగా నిలిచారని జయదేవ్‌ పేర్కొన్నారు. ఎస్పీగా ఉన్నవ్యక్తి ఒకవైపు దండంపెడుతూనే , మరోవైపు చేయాల్సింది చేస్తూనే ఉన్నారని, గిచ్చడం, రక్కడం చేసి చివరకు లాక్కెళ్లారని ఆయన వాపోయారు. ఎంపీ విషయంలోనే ఇంతదారుణంగా ప్రవర్తించిన పోలీసులు , ఇకసామాన్యప్రజల్ని ఎంతలా వేధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. తనకు జరిగిన దానికన్నా, సాటిరైతులు, మహిళలు, ఇతరులపై పోలీసులుప్రవర్తించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాజ్యాంగంపట్ల నమ్మకం, గౌరవం, సదభిప్రాయం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డని, ఆయనకు ప్రజలమీద గౌరవం, మర్యాద లేవని, టీడీపీనేత, రాజ్యసభసభ్యులు కనకమేడ ల రవీంద్రకుమార్‌ స్పష్టంచేశారు. తనను బాధించిందనే జగన్‌ మండలిని రద్దుచేశాడని, ఆయన గత 7నెలలనుంచీ ప్రజల్ని ఎంతగా బాధించి, వేధించాడో ఎందుకు ఆలోచించ లేకపోతున్నాడన్నారు. 30-05-2019నుంచి మండలి 32 బిల్లులవరకు ఆమోదించిం దని, రెండుబిల్లుల్ని సెలెక్ట్‌కమిటీకి పంపితే ఆ నిర్ణయాన్ని జగన్‌ తప్పుపట్టడం దారుణమ న్నారు. మండలిలో చర్చించిన అంశాలను అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని, ముఖ్యమంత్రి ఆదేశాలతో స్పీకర్‌ తమ్మినేని విచక్షణ, సభ్యత కోల్పోయి ప్రవర్తించాడన్నారు మండలిని రద్దుచేయడానికి జగన్‌కు ఏం అధికారాలున్నాయని, రద్దుచేయడానికి అదేమైనా ఆయన కుటుంబసమస్యా అని కనకమేడల ప్రశ్నించారు. రాజకీయపరమైన కుట్రతోనే, బీసీలు అధికంగా ఉన్న మండలిని జగన్‌ రద్దుచేశాడని, తద్వారా ఆయన తాను బీసీల వ్యతిరేకినని చెప్పకనే చెప్పాడన్నారు.

టీడీపీ హయాంలో నరేగా పథకాన్ని సద్వినియోగంచేసుకొని, ఏరాష్ట్రం చేయనివిధంగా రోడ్లు, భవనాలు, చెత్తనుంచి సంపదతయారీ కేంద్రాలవంటి పనులు చేయడం జరిగిం దని, ఆపనులు చేసినవారికి ఇప్పటికీ నిధులు ఇవ్వకుండా వైసీపీసర్కారు వేధిస్తోందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈవ్యవహారంపై కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కి ఫిర్యాదు చేశామని, ఆయనచెప్పినా వినకుండా, ఆఖరికి హైకోర్టుచెప్పినా ఖాతరుచేయకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌ లో ప్రస్తావించి, రాష్ట్రసర్కారు వైఖరిని ఎండగడతామని రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశా రు. భవనాలు కట్టినవారికి బిల్లులు చెల్లించకుండా, అదేభవనాలకు తమపార్టీ రంగులు వేసుకున్నారని, తద్వారా వందలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలసొమ్ముతో, వారంవారం కోర్టులచుట్టూ తిరుగుతు న్నారని, అదే ఆయన ప్రజలకు ఇచ్చిన గొప్పబహుమానమని కింజారపు వ్యాఖ్యానించా రు. నరేగా నిధులు ఇవ్వమన్నా, రంగులు ఎందుకువేశారన్నా, క్రమంతప్పకుండా కోర్టుకు హాజరవ్వాలని చెప్పినా వినిపించుకోకుండా జగన్‌ ప్రవర్తిస్తున్నాడన్నారు. వైసీపీ వైఫల్యాలను చూసినతర్వాత రాష్ట్రప్రజలంతా తిరిగి చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటున్నారని రామ్మోహన్‌నాయడు తెలిపారు. జగన్‌ ఎన్ని ఇబ్బందులుపెట్టినా, టీడీపీ ఎల్లప్పుడూ రాష్ట్రప్రజల భవిష్యత్‌కోసం, వారిపక్షానే నిలిచిపోరాటం చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read