ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక సమస్యల పై పార్లమెంట్ లో ప్రస్తావించారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్. పార్లమెంట్ లో ఈ రోజు మాట్లాడిన గల్లా జయదేవ్ ముఖ్యంగా అమరావతి విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ సమయంలో అందరు ఏకగ్రీవంగా ఆమోదించారని, ప్రధాని కూడా వచ్చి శంకుస్థాపన చేసారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చాలా పనులు జరిగాయని, రూ.41 వేల కోట్లతో వివిధ రకాల పనులు జరుగుతున్నాయని, 9 వేల కోట్లు ఖర్చు చేసారని తెలిపారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న రాజధాని ప్రాంతాన్ని మార్చేయాలని నిర్ణయం తీసుకుందని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అమరావతిని అంశాన్ని కేంద్రం తన జాబితాలో చేర్చాలని అన్నారు. ఆర్టికల్ 248 ప్రకారం కేంద్రం, రాష్ట్రం పరిధిలో లేని అంశాల పై పార్లమెంట్ లో చట్టం చెయ్యవచ్చని చెప్పారు. అమరావతి అంశంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై అమరావతి రైతులు ఆవేదనతో ఉన్నారని, కేంద్రం ఈ విషయం పై జోక్యం చేసుకోవాలని అన్నారు.

ఇక అలాగే గల్లా జయదేవ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై కూడా పార్లమెంట్ లో ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ బకాయలు రూ.3,600 కోట్ల రావాల్సి ఉందని, అవి వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా పెండింగ్ ఉన్నాయని, అవి కూడా వెంటనే విడుదల చెయ్యాలని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతునట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక లోటు, దారుణంగా పెరిగిపోయిందని, 0.16% ఉండాల్సింది 2.5%కి చేరిందని, ఈ పరిస్థితిలో కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలని గల్లా జయదేవ్ కోరారు. అలాగే విభజన హామీల్లో 29 హామీలు ఇస్తే, ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తీ చెయ్యలేదని తెలిపారు. దేనికీ కూడా పూర్తిగా నిధులు ఇవ్వలేదని అన్నారు. అయితే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అవేమీ పట్టించుకోకుండా, వేరే విషయాల పై రచ్చ చేస్తున్నారని అన్నారు. మరో పక్క వైసిపీ ఎంపీలు మాత్రం చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి అంటూ, మూడు రోజులుగా గొడవ చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read