కేంద్ర హోం శాఖ వర్గాలు కొత్త మ్యాప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ, ఈ నెల మొదటి వారంలో, భారత దేశానికి సంబందించిన కొత్త మ్యాప్ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలను చూపిస్తూ, ఆ రాష్ట్ర రాజధానులను కూడా పాయింట్ అవుట్ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మాత్రం, రాజధాని అమరావతిగా పెట్టలేదు. తెలంగాణాకు హైదరాబాద్ ని రాజధానిగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిపాలన హైదరాబాద్ నగరం నుంచే జరుగుతున్నట్టు ఆ మ్యాప్ లో పెట్టారు. మొన్నటి దాక అమరావతిని చూపించి, ఇప్పుడు ఎందుకు చుపించలేదో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కేంద్రాన్ని అడగలేదు. మన రాజధాని లేకుండా, ఒక కొత్త మ్యాప్ రిలీజ్ అయితే, ప్రభుత్వంలో ఉన్న పాలకులు, అమరావతిలోనే ఉంటూ, అమరావతిని మా రాజధానిగా ఎందుకు పెట్టలేదు అని కేంద్రాన్ని అడగలేక పోయారు.

galla 21112019 2

22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నా, ఈ విషయం పై అడగలేదు. ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఆంధ్రుల రాజధానిని కేంద్రం ఎందుకు గుర్తించలేదో, అని ప్రజల తరుపున అడగాల్సిన బాధ్యత అందరి పై ఉంటుంది. అయితే 22 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగ పోయినా, ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ విషయం పై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీసింది. ఈ రోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్నీ ప్రస్తావించింది. జీరో హావర్ లో, ఈ విషయం పై మాట్లాడటానికి తెలుగుదేశం పార్ట్ నోటీస్ ఇచ్చింది. దీంతో ఈ రోజు పార్లమెంట్ లో, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, పార్లమెంట్ లో అమరావతి విషయం ప్రస్తావించారు.

galla 21112019 3

అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించకుండా, అమరావతి లేకుండానే హోంశాఖ కొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనని లోక్‌సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీని కూడా, మీరే అవమానించినట్టు అని చెప్పారు. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి, అమరావతి గొప్ప రాజధాని కావాలంటూ, ఆ రోజు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఇండియా మ్యాప్‌లో రాజధాని అమరావతి లేకపోవడం వల్లే, రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వారు కూడా, అనుమానంగా చూస్తున్నారని అన్నారు. కేంద్రం చేసిన ఈ తప్పిండం, తక్షణం కేంద్ర హోంశాఖ తప్పును సరిదిద్దాలని గల్లా జయదేవ్‌ తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read