వైసీపీకి సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేసేందుకు ప్ర‌త్యేకంగా వేల మంది సైన్యం ఉంది. దీనికి తోడు ఆర్జీవీ, పోసాని, శ్రీరెడ్డి వంటి వారు వైసీపీ బూతు ఎటాక్స్‌కి అద‌న‌పు బ‌లం. ఇన్ని ఉన్నా ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రరూపు దాల్చింది. వైసీపీ పెయిడ్, పేటీఎం ప్ర‌చారాల‌ని జ‌నం న‌మ్మ‌డంలేదు. సాక్షిలో స్టోరీ వేస్తే వైసీపీ వాళ్లే చూడ‌టంలేదు. దీంతో వైసీపీకి చెందిన బ్లూ చాన‌ల్స్‌గా ముద్ర‌ప‌డిన ఎన్టీవీ, టీవీ9 వంటివి టిడిపిని బ‌ద్నాం చేసే స్పెష‌ల్ ప్రోగ్రామ్స్ ర‌న్ చేస్తున్నాయి. జ‌గ‌న్  క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టం కోసం ఎన్టీవీ  త‌న తోక చాన‌ల్ వ‌నిత టివిలో గంగవ్వతో ఓ ప్రోగ్రాం చేశారు. ఎన్టీవీ రాసిన స్క్రిప్టు ప్ర‌కారం చంద్రబాబు, లోకేష్ ఫొటోలు గంగ‌వ్వ‌కి చూపించి జాత‌కం చెప్ప‌మ‌న‌డం, జాతకాలను తాను చెప్పలేన‌న‌డం, మ‌ళ్లీ రెట్టించి అడిగి ''చంద్రబాబుకు గ్రహణం పట్టింది'' అని గంగవ్వతో చెప్పించ‌డం అనే ఓ ప్రోగ్రాం ఎన్టీవీ చేసింది. ఇది ఎవ‌రూ చూడ‌క‌పోవ‌డం వైసీపీ-ఎన్టీవీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ‌ని చాటిచెబుతోంది. అయితే టిడిపి కేడ‌ర్ చాలా రోజుల క్రితం చేసిన ఈ పెయిడ్ స్క్రిప్టెడ్ ప్రోగ్రాంని ఇప్పుడు చూసి చాలా బాధ‌ప‌డ్డారు. అమాయ‌క‌మైన గంగ‌వ్వ ఇలా చేసి ఉండ‌ద‌ని అంద‌రూ అనుమానించారు. గంగ‌వ్వ‌కి టిడిపి అభిమానులు ఫోన్లు చేస్తే...అస‌లు విష‌యం చెప్పేసింది గంగ‌వ్వ‌. త‌న‌కు చ‌దువు రాద‌ని..ఆ చాన‌ల్ వాళ్లు చెప్పిన‌ట్టు చేస్తే, డ‌బ్బులిస్తామ‌ని ఇలా చేశార‌ని జ‌గ‌న్ బ్లూ మీడియా గుట్టు విప్పేసింది. చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల బాధపడుతున్నానని, టీవీ ఛానెల్ వాళ్లు అనమంటేనే తాను అన్నానని, ఆ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు. చంద్రబాబును క్షమాపణలు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read