గత కొంత కాలంగా, తెలుగుదేశం నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు అంటూ, వార్తలు హాల్ చల్ చేసాయి. ఆయన బీజేపీ నేతలను కలిసారని, కాదు కాదు వైసీపీ నేతలను కలిసారని, బీజేపీలో చేరుతున్నారని, కాదు కాదు వైసీపీ లో చేరుతున్నారని, ఇలా అనేక ప్రచారాలు జరిగాయి. అయితే దాదాపుగా నెల రోజులుగా, గంటా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఆయన వ్యవహార శైలి కూడా, ఈ ప్రచారానికి బలాన్ని ఇచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా, ఆయన స్పందించక పోవటంతో, అందరూ ఆయన పార్టీ మార్పు ఖాయం అని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా, ఈ రోజు గంటా మౌనం వీడి, మీడియా ముందుకు వచ్చారు. దీంతో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నా అనేది ప్రచారం మాత్రమే అని, తాను తెలుగుదేశం పార్టీని వీడటం లేదని, వేరే పార్టీలో చేరటం లేదని గంటా స్పష్టం చేసారు.

ganta 05122019 1 2

ఈ రోజు తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, తన నియోజావర్గం సమీక్షా సమావేశం నిర్వహించానని, వార్డుల విభజన జరిగిన తరువాత, సమర్ధులైన వారిని గుర్తించి, వారిని నియమిస్తామని గంటా చెప్పారు. ఈ ప్రెస్ మీట్ తో, గంటా పార్టీ మారుతున్నారు అనే ప్రచారానికి తెర పడినట్టు అయ్యింది. అయితే, గంటా పార్టీ వీడకుండా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని భావించటం పై, నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీలో చేరటానికి, ఆ పార్టీ స్థానికి మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన రాకను వ్యతిరేకించారని, అందుకే బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతుంది. తరువాత ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని అని కూడా అన్నారు. తాజాగా, గంటా చేసిన ప్రకటనతో ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్న స్పష్టత వచ్చినట్టయింది.

ganta 05122019 1 13

ఇక మరో పక్క ప్రకాశం జిల్లా పై వైసీపీ ఫోకస్ చేసిందని, అక్కడ ఉన్న నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో, ముగ్గురు వైసీపీలో చేరటానికి, రెడీగా ఉన్నారు అంటూ, ప్రచారం చేసారు. ఆ ముగ్గురిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కారణం బలరాం కూడా ఉన్నారంటూ, ప్రచారం చేసారు. అయితే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఇన్నాళ్ళు పార్టీలో కొనసాగిన నేత, ఇలా ఎందుకు చేస్తారు అంటూ టిడిపి కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ అని తెలుగుదేశం చెప్తుంది. ఈ నేపధ్యంలోనే, తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కరణం బలరాం స్పష్టం చేశారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తమకు రాళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం లేదని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పార్టీ మారాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read