ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతల పై కక్ష సాధింపు కొనసాగుతుంది. మొన్నటి మొన్న, చంద్రబాబు తన క్యాంపు ఆఫీస్ గా ప్రజా వేదిక ఇవ్వమని అడిగారని, రాత్రికి రాత్రి నిబంధనలు పేరుతొ, దాన్ని పదాగొట్టేసారు. అలాగే రాష్ట్రంలో వివధ చోట్ల తెలుగుదేశం నేతలకు చెందిన భవనాలు టార్గెట్ గా చేసుకుని, పడగొట్టారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ మురళీ మోహన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు సంబంధించిన భవనాలు కూల్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వంతు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావుది. విశాఖపట్నంలో గంటా శ్రీనివాస్ రావుకు సంబంధించి, పలు భవనాలు కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భీమిలోని గంటా శ్రీనివాస్ క్యాంపు ఆఫీస్ సహా, పలు భవనాలు కూల్చివేతకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. అయితే, కేవలం 24 గంటలు నోటీస్ ఇచ్చి, కొట్టేస్తున్నాం అని చెప్పటం కక్ష సాధింపు అంటూ తెలుగుదేశం ఆరోపిస్తుంది.

ganta 23082019 2

విశాఖ పరిధిలోని భీమిలిలో, టౌన్‌ సర్వేనంబర్‌ 442లో గంటా కుమార్తె గంటా సాయిపూజిత పేరుతో నిర్మించిన జి+2 భవనాన్ని గంటా శ్రీనివాస్ ఆయన క్యాంప్‌ కార్యాలయంగా వాడుకుంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, ఈ భవనానికి అనుమతి లేదు, మేము కూల్చేస్తున్నాం అని నోటీస్ ఇవ్వటానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో, ఆ భవనం ఉన్న గోడకు, నోటీస్ అంటించి వెళ్లారు. దీని పై, గంటా హైకోర్ట్ కు వెళ్లారు. దీని పై హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. ఈ విషయం పై హైకోర్ట్, జీవీఎంసీ అధికారులను వివరణ కోరింది. ఆ సమయంలో జీవీఎంసీ అధికారులు, ఇది అక్రమ భవనం అని, అందుకే దీన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ganta 23082019 3

అయితే దీని పై కోర్ట్ స్పందిస్తూ, అన్ని వివరాలు చూడాలని, అప్పటికీ కూల్చేయాలి అనుకుంటే, వారం ముందు ఆ భావన యజమానికి నోటీసు ఇచ్చి, ఆ భవనంలోని వస్తువులకు ఇబ్బంది లేకుండా చూసుకుని, అప్పుడు నిర్ణయం తీసుకోవాలని కోరింది. అయితే, జీవీఎంసీ అధికారులు మాత్రం, కేవలం 24 గంటలు నోటీస్ ఇచ్చి, భవనం కాళీ చెయ్యండి, లేకపోతె, కొట్టేస్తాం అంటూ నోటీస్ ఇచ్చారని గంటా వర్గం ఆరోపిస్తుంది. ఇప్పటికే భవన నిర్మాణం, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నామని, దాని పై ఏమి స్పందించకుండా, రాజకీయ కక్షతోనే తన భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారని గంటా ఆరోపించారు. ఒక వేళ కూల్చాలి అనుకున్నా, కొంత టైం ఇవ్వాలి కదా, రాత్రి నోటీస్ ఇచ్చి, ఉదయం కొట్టేస్తాం అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read