ఒక పక్క ప్రపంచం వణికి పోతుంది. కరోనా మహమ్మారి, అమెరికా లాంటి దేశాన్ని కూడా గడగడలాదిస్తుంది. మన దేశంలో కూడా, నెమ్మదిగా అందుకుంటుంది. ప్రధాని దగ్గర నుంచి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కరోనాని ఎదుర్కోవటం పైనే శ్రద్ధ పెట్టారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా లక్షణాలు ఉన్న వారిని ట్రేస్ చెయ్యటం, వారికి టెస్ట్ లు చెయ్యటం, తేడాగా ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం. తరువాత స్టేజ్ వస్తే ఎలా ఉంటుందో అని, ఇప్పటి నుంచి వెంటిలేటర్లు, హాస్పిటల్స్ రెడీ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో కూడా, ఇవి ఒక పక్క జరుగుతున్నట్టు కనిపిస్తున్నా, కేసులు మాత్రం, అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజే, ఇంకా చెప్పాలి అంటే, నిన్న రాత్రి నుంచి, 9 గంటల్లో 43 పోజిటివ్ కేసులు వచ్చాయి. అంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మన ముఖ్యమంత్రి, ప్రభుత్వం, ఎంత అలెర్ట్ గా ఉండాలి ? కరోనా పై ఎంత అప్రమత్తంగా ఉండాలి ? రాబోయేది కూడా అలోచించి, అన్నీ సన్నద్దం చెయ్యాలి.

ఇవి చేస్తున్నారో లేదో కాని, మన దగ్గర మాత్రం, అమరావతి పై పగ, ప్రతీకారం తీర్చుకోవటంలో మాత్రం, నిరంతం బిజీగా ఉంటున్నారు. ప్రపంచం మొత్తం,కరోనా భయంతో భయపడుతుంటే, రాష్టం పై కరోనా విజృంభణ ఎలావుంటుందో నిన్న, 12 గంటల్లో, 43 కరోనా కేసులు నమోదై, దేశంలో ఇప్పటివరుకు ఏ రాష్ట్రములో నమోదు కానీ, అన్ని కేసులు ఒకేసారి నమోదై, రాష్ట్ర ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటుంటే, మన జగన్ మొహన్ రెడ్డి గారు, నిన్న అత్యున్నత స్థాయి సమావేశంలో అమరావతి రాజధాని భూముల్లో, అభివృద్ధిని విస్మరించి, ఆ భూముల్ని, ఇళ్లపట్టాలని, నవరత్నాలకి పంచటం పై, హైకోర్టు స్టే విదిస్తే దాని పై సుప్రీం కోర్టులో, పీల్ దాఖలు చేయాలని, దానికి ఏర్పాట్లు చెయ్యాలని, ఆదేశాలు జారీచేశారు.

పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి సంబంధించి నిబంధనల్లో సవరణలు చేస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఖాళీ ఇళ్ల స్థలాల విక్రయంపై నిషేధం విధిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన ఉచిత ఇంటి స్థలంలో లబ్ధిదారులు కనీసం ఐదేళ్ల పాటు హక్కు కలిగి ఉండాల్సిందేనని జీవోలో పేర్కొంది. ప్రతి లబ్ధిదారు ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులో, అమరావతి భూములు విషయంలో ఎదురు దెబ్బ తగులుతూ ఉండటంతో,ఈ మేరకు ప్రభుత్వం ఈ మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల కాలపరిమితి తర్వాత మాత్రమే బదలాయింపు, విక్రయానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో, ఇప్పుడు అమరావతిలో భూపంపిణీ పై, హైకోర్ట్ తీర్పు పై, ఈ కొత్త జీవోతో, సుప్రీం కోర్ట్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక పక్క కరోనాతో అల్లాడుతుంటే, ఈ సమయంలో కూడా అమరావతిని ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకున్నారు, జగన్ గారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read