నిన్న సాయంత్రం నుంచి, ఏపి బీజేపీ సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీకి అత్యంత దగ్గర వారు అయిన, నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ పార్టీ మారి, వైసీపీలోకి వెళ్తున్నారు అంటూ, పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్ని ప్రముఖ మీడియాలో ఈ వార్తలు రావటంతో, అందరూ నిజమే అని నమ్మరు కూడా. ఇది ఏపి బీజేపీకి పెద్ద దెబ్బ అని, అందరూ భావించారు, గోకరాజు లాంటి వారు కూడా బీజేపీ సిద్ధాంతాలు పక్కన పెట్టి, వైసీపీలోకి వెళ్ళటం పై ఆశ్చర్యపోయారు. అయితే, తన పై నిన్నటి నుంచి వచ్చిన వార్తల పై, ఈ రోజు గోకరాజు గంగరాజు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ, నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, గోకరాజు చెప్పారు. తన గురించి వార్తలు రాస్తూ, తన అభిప్రాయం తీసుకోకుండా, మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

gokaraju 09122019 1

తాను బీజేపీ ఎంపీ చేసిన తరువాత, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాని, బీజేపీ పార్టీలోనే ఉన్నానని, ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను అంటూ, చెప్పుకొచ్చారు. తనకు ముందు నుంచి రాజకీయాల పై పెద్దగా ఆసక్తి లేదని, తాను వీహెచ్‌పీలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో, 2014 ఎన్నికల సమయంలో అశోక్ సింఘాల్ తన పై ఒత్తిడి తెచ్చి, నరసాపురం ఎంపీగా పోటీ చేపించారని, అప్పుడు గెలిచానని చెప్పారు. రాజకీయాలు అంటే ఆసక్తి లేకపోయినా, ప్రజలకు సేవ చేయొచ్చు అనే భావంతో ఆ రోజు ఎంపీగా పోటీ చేసానని, అప్పట్లో నరసాపురం నుంచి పార్టీలు మారుతూ వచ్చిన రఘురామకృష్ణం‌రాజు టికెట్ అడగ్గా, బీజేపీ అధిష్టానం, పార్టీలు మారే వారికి, టికెట్ ఇవ్వం అని చెప్పటంతో, తాను పోటీ చెయ్యాల్సి వచ్చిందని అన్నారు.

gokaraju 09122019 1

అశోక్ సింఘాల్ నాకు‌ గాడ్ ఫాదర్ వంటి‌వారని, ఆయన మాట ప్రకారమే ఆ రోజు ఎంపీగా సేవ చేసానని, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా, మళ్ళీ వీహెచ్‌పీ ద్వారా సేవ చేస్తున్నానని అన్నారు. అయితే, ఇక్కడ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు గోకరాజు. తాను చేరటం లేదని, తన కుమారుడు, సోదరులు వైసీపీలోకి వెళ్తున్నారని అన్నారు. తన కుమారుడు రంగరాజు, వైఎస్‌ జగన్‌కు మిత్రుడని అన్నారు. గతంలోనే ఎంపీ సీటు ఆఫర్ చేసారని చెప్పారు. అయితే, తన కుమారుడు వైసీపీలో చేరుతున్నాను అని చెప్పగా, అలోచించి నిర్ణయం తీసుకోమన్నాని ఆయన అన్నారు. గతంలో కూడా, సోదరులు గోకరాజు రామరాజు, నరసింహరాజులు కాంగ్రెస్ తోనే పని చేసారని, ఆ పరిచాయలతో, ఇప్పుడు వాళ్ళు వైసీపీలోకి వెళ్తున్నారని, తనకు మాత్రం, ఆ పార్టీలో చేరే ఉద్దేశం లేదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read