ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మారిపోతుంది. ఆరు నెలల్లోనే, స్నేహంగా ఉన్న పార్టీలు, ఇప్పుడు శత్రువులుగా మారిపోయాయి. ఎన్నికల ముందు, చంద్రబాబుని మరోసారి ముఖ్యమంత్రిని అవ్వకుండా చూడాలనే టార్గెట్ తో, కేంద్రంలోని బీజేపీ, అన్ని విధాలుగా, వైసీపీకి సహకరించింది. వ్యవస్థలు అన్నీ వైసీపీకి అనుకూలంగా పని చేసాయి. చివరకు చంద్రబాబుని దింపేసారు. అయితే ఎన్నికలు అయిన తరువాత, అటు కేంద్రంలోని బీజేపీకి, ఇటు రాష్ట్రంలోని వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఇద్దరు కలిసి చంద్రబాబుని అన్ని విధాలుగా ఇబ్బంది పెడతారని అందరూ భావించారు. మొదట్లో విజయసాయి రెడ్డి కూడా, మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. అయితే ఏమి జరిగిందో ఏమో కాని, గత రెండు మూడు నెలల నుంచి, జగన్ మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, ఢిల్లీలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది వరకు ఉన్న పరపతి, ఇప్పుడు ఢిల్లీలో ఇద్దరు నేతలకు లేదు.

bjp 08122019 2

సామాన్య ఎంపీలకు కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తుంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి మాత్రం, గత రెండు పర్యాయాలు, హోం మంత్రి అపాయింట్మెంట్ దొరకటం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి, ఢిల్లీ వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డికి, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. అది కూడా ఒకటికి రెండు సార్లు. దీంతో జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ అధిష్టానం పై రగిలిపోతున్నారు. దీంతో బీజేపీ పై, రివెంజ్ తీర్చుకే పనిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఇన్నాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని మాత్రమే టార్గెట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు బీజేపీని కూడా టార్గెట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బలమైన బీజేపీ నేతలను, తమ పార్టీలో చేర్చుకునే ఆపరేషన్ ఆకర్ష కు తెరలేపారు.

bjp 08122019 3

దీంతో మొదటిగానే, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో బలమైన నేతగా పేరున్న, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబాన్ని తమ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుని చర్చలు జరిపారు. గోకరాజుకి ఉండవల్లి కరకట్ట వెంబడి అనేక ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ రేపు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు, రేపు గన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే ఈ పరిణామం పై, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గోకరాజు గంగరాజు మొదట్నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. అమిత్ షా ఎప్పుడు, ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అలాంటి గోకరాజు, ఇప్పుడు పార్టీ మారటం చూస్తుంటే, రాజకీయ వాతవరణం వేగంగా మారే అవకాసం కనిపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read