అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కు, సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గొట్టిపాటి రవికుమార్ కూడా చెందిన కిషోర్ గ్రానైట్ కంపెనీకి ఏపి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీస్ పై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే విధించింది. కిషోర్ గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయి అంటూ ఏపి ప్రభుత్వం విజిలెన్స్ డిపార్టుమెంటు ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఆ కంపెనీని మూసివేయాలని, అలాగే 50 కోట్లు జరిమానా విధించాలి అంటూ, ఏపి ప్రభుత్వం , గొట్టిపాటి రవికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే ఆ షోకాజ్ నోటీస్ ను గొట్టిపాటి రవి కోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు సింగల్ జడ్జి బెంచ్ కొట్టేసింది. అయితే ఆ తరువాత ఏపి ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఏపి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఏపి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ చెల్లుతుందని, ప్రభుత్వం చెప్పినట్టు 50 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని, గొట్టిపాటి రవి కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసారు. దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ తరుపున హాజరు అయిన సీనియర్ న్యాయవాది, విజిలెన్స్ కమిషన్ కు, ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ కు సంబంధం లేదని కోర్టు ముందు వాదించారు.

gottpati 25102021 2

అసలు ఈ విషయంలో అవకతవకలు ఉన్నాయి అంటూ, దీని పై నివేదిక ఇవ్వటానికి, సిఫార్సు చేయటానికి వారికి అధికారం లేదని గొట్టిపాటి రవికుమార్ తరుపు న్యాయవాది శ్యాం దివాన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. శ్యాం దివాన్ వాదనలు విన్న తరువాత సుప్రీం కోర్ట్ ధర్మాసనం, గొట్టిపాటి రవి కుమార్ కు ఉపసమనం కల్పించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుని పక్కన పెడుతూ, ఏపి ప్రభుత్వం ఇచ్చినటువంటి, షోకాజ్ నోటీస్ ని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. అయతే ప్రభుత్వం వచ్చిన కొత్తలో, టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవటానికి వైసిపి అనేక ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలు ఫలించి, కరణం బలరాం, వంశీ, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ లాంటి వాళ్ళు పార్టీ మారారు. అయితే గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు పై అనేక ఒత్తిడులు వచ్చినా, వారు మాత్రం పార్టీ మారలేదు. ఏదైనా న్యాయ ప్రకారం తేల్చుకుంటాం అని, పార్టీ మాత్రం మారం అంటూ, కోర్టులో పోరాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read