ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వం నుంచి ఏ ఫైల్ వచ్చినా, వెంటనే ఆమోదించి పంపించే గవర్నర్, ఒక ఫైల్ విషయంలో మాత్రం అభ్యంతరం తెలుపుతూ మరింత సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నారు. అదే కొత్తగా ఎన్నిక అయ్యే నలుగురు ఎమ్మెల్సీల గురించి. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు కొన్ని పేర్లు సూచిస్తూ ప్రభుత్వం ఒక ఫైల్ గవర్నర్ వద్దకు పంపింది. అయితే, ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించకుండా, నాలుగు రోజులు అయిన ఇంకా పెండింగ్ లో నే ఉంచారు. ఆ నలుగురు పేర్లలో, వైసీపీ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ గా, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, అలాగే మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్న భీమవరానికి చెందిన మోషేన్‌ రాజుని, అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి, టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులుని, అలాగే ప్రొద్దుటూరు కు సంబంధించి రమేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తిని, ఇలా మొత్తం నలుగురు పేర్లను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎంపిక చేస్తూ, ఆ ఫైల్ ని పూర్తి చేసి, గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపించింది. సహజంగా ఏ ఫైల్ అయినా గవర్నర్ వద్దకు వెళ్ళిన తరువాత, కొద్ది సమయంలోనే దాని పై గవర్నర్ ఆమోద ముద్ర వేసి, సంతకం పెట్టి, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉంటారు.

governor 14062021 2

ఆ క్రమంలో భాగంగానే, ఈ కొత్త ఎమ్మెల్సీల ఫైల్ శుక్రవారం నాడే గవర్నర్ కు పంపించినా, ఇప్పటి వరకు గవర్నర్ వద్ద ఆ ఫైల్ ఆమోదం పొందలేదు. అయితే ప్రభుత్వ వద్ద ఉన్న సమాచారం ప్రకారం, నలుగురు వ్యక్తుల్లో , ఇద్దరు వ్యక్తుల పట్ల గవర్నర్ కొంత అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే వారి పై గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందటం, అదే విధంగా మరొక వైపు గవర్నర్ కార్యాలయం కూడా విచారణ చేయగా, ఇద్దరి వ్యక్తుల పై కేసులు ఎక్కువగా ఉన్నాయని, రెండు పేర్లు పై అభ్యంతరం ఉన్న నేపధ్యంలో ఆ ఫైల్ పై సంతకం చేయకుండా ఫైల్ ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులు, వీళ్ళ ఇద్దరినీ గవర్నర్ కోటా కింద శాసనమండలికి పంపించటానికి గవర్నర్ సుముఖంగా లేరని తెలుస్తుంది. విమర్శలకు తావు లేకుండా, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ రోజు గవర్నర్ తో జగన్ సమావేశం ఉండటంతో, ఈ విషయం పైనే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read