సిఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుల పై, ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ఒక చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక్క వైసిపీ తప్ప అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరో పక్క రాజధాని కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులు పరిస్థితి వర్ణణాతీతం. ఇక మరో పక్క ఈ రెండు బిల్లులు కోర్టులో ఉన్నాయి, శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఈ రెండు బిల్లులు గవర్నర్ వద్దకు రావటంతో, ఇలాంటి చట్టబద్ధత లేని బిల్లులు పై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షన్ అందరిలో ఉంది. ఈ బిల్లుల పై గవర్నర్ రాజ ముద్ర పడుతుందా లేదా అనే చర్చ కొనసాగుతూనే ఉంది. బిల్లు ఆమోదం పొందాలంటే, గవర్నర్ సంతకం తప్పనిసరి. గవర్నర్ ఆమోదం చెప్తే, బిల్లు ఒకే అయినట్టే. రేపో మాపో గవర్నర్ ఈ బిల్లులు పై తన నిర్ణయం ప్రకటిస్తారు అనే ప్రచారం జరుగుతుంది.

రాజముద్ర పడిన వెంటనే, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, అమలు ప్రక్రియ ప్రారంభిస్తుంది. అయితే ఈ బిల్లులు అన్నీ చట్ట విరుద్ధంగా ఉండటంతో, ఈ ఫైల్స్ పై గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. అన్ని వైపుల నుంచి గవర్నర్ సలహాలు తీసుకుంటున్నారు. కేంద్రంలోని కొంత మంది పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గవర్నర్ ఈ బిల్లుల పై లేట్ చేస్తూ ఉండటం, సలహాలు పేరుతొ సమయం తీసుకోవటంతో, ప్రభుత్వం తన వైపు నుంచి దూతలుగా ఒక మంత్రిని పంపించింది. అలాగే కొంత మంది సీనియర్ అధికారులను కూడా గవర్నర్ వద్దకు పంపించి, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాల పై గవర్నర్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, వెంటనే బిల్లులు ఆమోదించాలని కోరారు. అయితే గవర్నర్ మాత్రం, దీని పై అనేక విధాలుగా, అన్ని వైపుల నుంచి అలోచించి, నిర్ణయం తీసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read