ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలు చూసి అందరూ షాక్ అయ్యారు. కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయం చూసి షాక్ అయ్యారు. ఎక్కడైనా ప్రజల డబ్బుతో, రాజకీయ ప్రచారం చేయటం ఎప్పుడైనా చూసామా ? బహుసా చరిత్రలో మొదటి సారి ఆ రికార్డు ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రేక్ చేసింది. రాజకీయ నాయకులు అంటే, ఇలా అత్యుత్సాహం చూపిస్తారని అనుకోవచ్చు, మరి ప్రభుత్వం అధికారులు ఏమి చేస్తున్నట్టు ? తెలిసి తెలిసి ఇలాంటి ప్రకటనలు ఎందుకు ఒప్పుకున్నారు ? రేపు ఈ విషయం కోర్టుకు వెళ్తే జగన్ మోహన్ రెడ్డికి, ఆయన మంత్రులకు ఏమి అవ్వదు, బలి అయ్యేది అధికారులే. ఇక విషయానికి వస్తే, గత ప్రభుత్వం, దాదాపుగా 7 లక్షలు పైగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసింది. కేవలం చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. చాలా వరకు అలాట్మెంట్ కూడా అయిపొయింది. ఇవి మొత్తం మూడు క్యాటగిరీలు ఉంటాయి, 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగులు. వీటికి కేంద్రం లక్షన్నర ఇస్తే, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షలు ఇచ్చింది. మొత్తం లోపల మంచి మెటీరియల్ తో, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్ లాగా పార్క్, హెల్త్ కేసు సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఓపెన్ జిం, ఇలా అనేక సౌకర్యాలతో గత ప్రభుత్వం నిర్మించింది. మిగతా డబ్బులు, లబ్దిదారులు లోన్ రూపంలో కట్టుకోవాలని చెప్పింది. అయితే 2019 ఎన్నికల్లో అటు చంద్రబాబు, ఇటు జగన్ కూడా తమ మ్యానిఫెస్టో లో, ఆ లోన్ లేకుండా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు జగన్ వైపు మొగ్గి, ఆయన్ను గెలిపించారు.

jagan 29112020 2

ఎన్నికల్లో గెలిచి 18 నెలలు అయ్యింది. ఇస్తానన్న ఇళ్లు ఇవ్వటం లేదు. చేస్తానన్న రుణ మాఫీ హామీ అమలు చేయటం లేదు. సహనం నశించిన లబ్దిదారులు ఉద్యమ బట పట్టారు. రాజకీయ పార్టీలు వీరికి తోడు అయ్యాయి. దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి రావటంతో, ఇప్పుడు రాజకీయం చేసి, ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. చంద్రబాబు స్కీం కావాలా, జగన్ స్కీం కావాలా అంటూ ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ఇందులో చంద్రబాబు ఏంటి, జగన్ ఏంటి ? అవి ప్రజల డబ్బులు. పేదలకు ఇళ్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా చంద్రబాబుకు పోయేది ఏమి ఉండదు. ఏది చేసినా అది జగన్ ప్రభుత్వానికి పేరు వచ్చేది. మరి చంద్రబాబు పేరు చెప్పి, ఈ రాజకీయ ప్రకటనలు ఏమిటి ? మీరు ఎన్నికల హామీల్లో రుణాలు అన్నీ రద్దు చేస్తానని, దీర్ఘాలు తీసుకుని చెప్పారు కదా, మరి ఇప్పుడు కేవలం 10 శాతం మాత్రమే ఉండే, 300 చదరపు అడుగులు ఇళ్లు రూపాయకు ఇస్తాం అని చెప్పటం ఏమిటి ? మిగతా 90 శాతం మంది పరిస్థితి ఏమిటి ? అవి బాబు స్కీంలోనే ఉంచుతారా ? అసలు ఈ చంద్రబాబు గోల ఏమిటి ? అధికారం మీది, మీరు ఏమి చేస్తారో చెప్పకుండా, అది కావాలా, ఇది కావాలా అని ప్రజలను అడగటం చూస్తుంటే, అసలు టిడ్కో ఇళ్లు ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా అనే అనుమానం కలుగుతుంది. ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ప్రసంగాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇచ్చినా, ఇవ్వకపోయినా చంద్రబాబుకి ఒరిగేది ఏమి ఉండదు, ఈ చంద్రబాబు ఫోబియా, 18 నెలలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా పోకుండా, ఆయనకు పుబ్లిసిటీ ఇవ్వటం ఏమిటో. ఈ సలహాదారులు నిజంగా గొప్ప వాళ్ళే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read