ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలుగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి సంబంధించి ఏపిలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం గత కెబినెట్ సమావేశంలో నిర్ణయించిన విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. వీరు కొత్త జిల్లాల ఏర్పాటుపైన పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని మానవ వనరుల వినియోగం, వివాదాలు లేకుండా జిల్లాల ఏర్పాటు అధికారుల విభజన వంటి అంశాలపైన నివేదిక ఇవ్వనుంది. అదే విధంగా నిధుల వినియోగం పైనా సూచనలు చేయనుంది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు మూడు నెలల కాలపరిమితిని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. గతనెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపైన సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

ఆ మీటింగ్ లోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపైన నివేదిక కోరుతూ నిర్ణయించారు. ఈ కమిటిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా సభ్యులుగా సీసీఎల్, సాధారణ పరిపాలనా కార్యదర్శి ప్రణాళికా శాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితోపాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక అధికారిని సభ్యులుగా ఖరారు చేశారు. వీరు ఏపిలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు ఏర్పాటు పైన ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఏ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి, ఆర్థిక.. మానవ వనరుల వినియోగం.. హద్దులు... అధికా రుల విభజన పైన నివేదిక సమర్పించనున్నారు. అయితే ఇప్పటికే జిల్లాల విభజన పై అన్ని వైపుల నుంచి, ముఖ్యంగా వైసిపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ధర్మాన ప్రసాద్ కూడా, జిల్లాల విభజన జాగ్రత్తగా చెయ్యాలని, లేకపోతె మొత్తం మునిగిపోతం అని అన్నారు. ఇక చాలా మంది మా ప్రాంతం ఇలా, మా ప్రాంతం అలా, ఈ పేరు పెట్టండి, ఆ పేరు పెట్టండి అంటూ, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం, ఈ విషయాన్ని ఏ సమస్య లేకుండా పరిష్కరిస్తుందో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read