ఉద్యోగుల సమస్యలు, వారిని ప్రభుత్వం మోసం చేస్తున్న తీరు పై, శాసన మండలి సభ్యులు, అశోక్ బాబు స్పందించారు. ఆయన మాటల్లోనే, "నిన్న ఒక వార్త పత్రికల్లో ఉద్యోగులపై వచ్చిన వార్త పై అనేక ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు అనుమానం వ్యక్తం చేసారు. ఒక టిడిపి ఎమ్మెల్సీ గానే కాకుండా ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా ఈ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని అనేక సార్లు చెప్పాను. జగన్ మోహన్ రెడ్డి ప్రజలనే కాదు ఉద్యోగస్తులను కుడా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని ఇప్పటికైనా ఉద్యోగస్తులు తెలుసుకోవాలి. జగన్ రెడ్డి పాదయాత్రలో ఉద్యోగస్తులకు అనేక హామీలు ఇచ్చారు. 1. అధికారంలోకి వస్తానే సి.పి.ఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. 2. ఉద్యోగస్తులు పదవీ విరమణ పొందే నాటికి ఇల్లు కట్టి ఇస్తాను అనేటువంటి చాలా వాగ్దానాలు చేశాడు. 3. సకాలంలో డి.ఏ ఇస్తామని చెప్పారు. 4. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇన్ని చేస్తామని చెప్పి మోసం చేయడం ఒక ఆర్దిక నేరస్తుడైన జగన్ కు మాత్రమే చెల్లింది. ఈ రోజు పి.ఆర్.సి విషయంలో గానీ, డి.ఆర్.సి. విషయంలో గానీ ఉద్యోగస్తులను నిలువునా ముంచాడు. ఫైనాన్సు డిపార్ట్ మెంట్ లో ఉన్న కొంతమంది అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఆంద్ర ప్రదేశ్ 27 % ఐ.ఆర్ ఇచ్చిందని, ఇది తెలంగాణ ఇవ్వలేదు కాబట్టి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. ఏపీ లో పి.ఆర్.సి, ఐ.ఆర్ లే కాదు ఉద్యోగస్తులకు సంబంధించి అనేక విషయాలతో ముడిపడి ఉన్నాయి. పి.ఆర్.సి ఇస్తేనే పెన్షన్ లో బెనిఫిట్ వస్తుంది. పి.ఆర్.సి ఇవ్వకపోతే ఐ.ఆర్ లో బెనిఫిట్ రాదు. ఈ సంగతులు ప్రజలకు తెలియదు. ఐ.ఆర్ ఇస్తున్నారులే బాగుంది అనుకుంటున్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు గానీ, మూడు లక్షల మంది పెన్షనర్లు, ఇతర ఉద్యోగస్తులు దాదాపు 66 శాతం జీతం వస్తే తప్ప గడవని పరిస్థితిలో ఉన్నారు. గ్రూప్ 1, ఆ పై స్థాయి ఉద్యోగస్తులు మినహా మిగతా ఉద్యోగులందరూ జీతాలు పెరగకపోతే చాలా ఇబ్బందులు పడుతారు. క-రో-న పరిస్థితులలో వీరి ఇబ్బందులు వర్ణనాతీతం. మొదటి కరోన వేవ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ తప్ప మిగతా ఉద్యోగస్తులకు జీతాలు కట్ చేస్తే ఎవరూ వ్యతిరేకించలేదు. ఉద్యోగస్తులకు జీతాలు వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు చెబితే దానిపై రాష్ట్ర ప్రబుత్వం అధికార మదంతో సుప్రీం కోర్టుకు వెళ్ళారు. నాడు ఉద్యోగ సంఘాలను పిలిచి వడ్డీ చెల్లించడం ప్రబుత్వానికి కష్టం అని చెప్పి ఉంటే ఉద్యోగస్తులు ప్రబుత్వానికి సహకరించి ఉండేవారు. 2020 అక్టోబర్ లో పి.ఆర్.సి ఇస్తే ప్రభుత్వం ఈనాటికి దాన్ని అమలు చేయలేదు. సి.పి.ఎస్ ను వారంలో రద్దు చేస్తామని ఇంత వరకు పత్తాలేదు. 2021 ఏప్రిల్ లో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ప్రభుత్వం సి.పి.ఎస్ ను రద్దు చేయలేమని చెప్పింది.

పి.ఆర్.సి, సి.పి.ఎస్ విషయంలోనూ మాట తప్పింది. ఎన్నికల నాటికి మూడు డి.ఏ లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు చెల్లించాలని నాడు చాల ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రబుత్వం మారిన తర్వాత నవంబర్ 2020 లో ఒక జీవో విడుదల చేసి జనవరి 21 న ఒక డి.ఏ ఇచ్చే విధంగా 1.7.2018 కి సంబందించిన డిఏ జీతాలలో, పెన్షన్ లలో కలిపి రావాలి. కానీ ఇంత వరకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం 1. 1.2020 నుండి డి.ఏ లను ఫ్రీజ్ చేసింది. ౩౦.06.2021 వరకు అంటే 18 నెలల డి.ఏ అరియర్స్ కుడా ఇవ్వలేమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కుడా కేంద్ర ప్రభుత్వ విధానాన్నే అనుసరిస్తామని జీవో నంబెర్ 95 లో చెప్పింది. 1.07.2018 నుంచి ఇవ్వాల్సిన మూడు డి.ఏ లు ఎప్పుడిస్తారో తెలియదు. 01.01.2020 నుంచి 30.06.2021 వరకు వచ్చే డి.ఏ పరిస్థితి కూడా లేదు. అంటే మొత్తం డి.ఏలకు పంగనామాలు పెట్టె పరిస్థితి తీసుకొచ్చారు. డి.ఏ లు పెరగనప్పుడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తో క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఏ విధంగా బ్రతకాలి. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు పెరిగితే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెరుగుతాయి. డి.ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు పి.ఆర్.సి. విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎందుకు పాటించడం లేదు? ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ప్రచారాలు. ప్రభుత్వం పేపర్ ప్రకటనలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి రెండు లక్షల ఎనబై వేల మంది గ్రామ వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు అని లేఖలు రాస్తాడు. ఇలాంటి బూటకపు అబద్దపు ప్రచారాలకు ప్రభుత్వం అలవాటు పడిపోయింది. నిన్న వచ్చిన వార్త చూసి ఉద్యోగస్తులు నష్టపోయామా? అని ఆశ్చర్యపోతున్నారు. ఉద్యొగస్థులు సమాజంలో బాగమేనని ముఖ్యమంత్రి గమనించాలి. ఉద్యోగస్తులు ప్రభుత్వ సొమ్మును అనాచితంగా తినడం లేదు. కష్టపడితేనే జీతాలు ఇస్తున్నారు తప్ప ఊరకనే ఇవ్వడం లేదు.

క-రో-నా ఉన్నా ప్రా-ణా-లు కోల్పోతూ డ్యూటీ చేస్తున్న ఉద్యోగస్తులకు ముఖ్యమంత్రి ఇచ్చే నజరానా ఏమిటి? తెలంగాణా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది ఉన్నా అక్కడ ౩౦ శాతం పి.ఆర్.సి. ఇచ్చారు. ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులు, పోలీసులు, మునిసిపల్ ఉద్యోగులు, టీచర్లు, స్వీపర్లు, డ్రైవర్లు కష్టపడుతున్నారు. కష్టపడ్డ వాలంటీర్లకు కోట్లు ఖర్చు చేసి నజరానాలు ఇచ్చారు. మరి ఉద్యోగస్తులకు ఏమి నజరానాలు ఇస్తారు. ఇప్పుదు ఉద్యోగస్తులలో ఉన్న మౌనం తుఫాను ముందర వచ్చే మౌనమే. ఉద్యోగస్తులు నోరుమూసుకుని కుర్చోరని ముఖ్యమంత్రి గమనించాలి. వాళ్ళ గుండెల్లో ఆవేశం రగులుతుంది. కావాల్సిన వాళ్లను సలహాదారులను పెట్టుకుని వారికి అన్నీ ఇస్తున్నారు తప్ప చిరు ఉద్యోగులకు ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు. జూనియర్ డాక్టర్లను సైతం మోసం చేసాడు. నవరత్నాలకు ముఖ్యమంత్రి ఇస్తున్న వాటికి ఉద్యోగస్తులు అడ్డు రారు. కానీ నవరత్నాలు సక్రమంగా అమలు కావాలంటే ఉద్యోగస్తులు పనిచేయాలని గుర్తుంచుకొండి. ఇంటింటికి రేషన్ సరుకులు ఇచ్చే వాళ్ళు జీతాలు పెంచాలంటే వారికి రూ . 16000 నుండి 21,000 కు పెంచారు. కానీ మెడికల్ వాళ్లకు ఎందుకు పెంచలేదు?. పి.ఆర్.సి.ని వెంటనే రిలీజ్ చేయాలని టి.డి.పి. ఎమ్మెల్సి గానే కాకుండా ఒక మాజీ ఉద్యోగ సంఘ నాయకుడిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సి.పి.ఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాటువిటీ ఇచ్చాం. దీని వల్ల చనిపోయిన చాలా మందికి ఫ్యామిలి పెన్షన్ వస్తుంది. ఆర్.టి.సి ని ప్రబుత్వం లో చేర్చినందుకు వారు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ కార్డుల విషయం చాలమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని క్రమబద్దీకరించాలి. ఇల్లు కట్టిస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read