ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే ప్రభుత్వం భయపడుతుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఉత్సాహంగా నిర్వహిస్తుంది. ఈ రోజు జరిగిన హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలే నిదర్శనం. మార్చ్ లో జరపాల్సి ఉండగా, ముందుగానే ప్రభుత్వం నిర్వహించింది. అలాగే చాలా ప్రభుత్వాలు పెండింగ్ ఉంటే కనుక, రాగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ద్వారానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే పరిస్థితి వచ్చింది. మార్చిలో కూడా హైకోర్టు చెప్తేనే ఎన్నికలకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అప్పట్లో ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు అయ్యింది. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగా, క-రో-నా వచ్చింది. ప్రపంచానికి ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. దీంతో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి కుదుట పడింది. అన్ని రాష్ట్రాలు ఎన్నికలు మొదలు పెట్టాయి. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా బై ఎలక్షన్స్ కూడా జరిగాయి. కొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిపాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం మళ్ళీ ఎన్నికలు అంటే ప్రభుత్వం భయపడుతుంది. ఒక పక్క క-రో-నా ని ఎదుర్కోవటంలో మేమే నెంబర్ వన్ అని ప్రచారం చేస్తూ, ఎన్నికలు అంటే మాత్రం క-రో-నా అంటుంది. పాదయాత్రలు, ఈ యాత్ర ఆ యాత్ర అంటూ చేసుకుంటూ, స్కూల్స్ నుంచి సినిమా హాల్స్ వరకు ఓపెన్ చేసి, ఆ సాకుతో ఎన్నికలు వద్దు అంటున్నారు.

hc 01112020 2

అయితే ఈ అంశం కోర్టులో ఉండటంతో, కోర్టు ఈ విషయం పై ఆరా తీయగా, ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంది. వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఎన్నికలకు ఒప్పుకున్నాయి. ఇదే విషయం కోర్టుకు చెప్తూ, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే దీని పై ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అభ్యంతరం చెప్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, హైకోర్టులో ఈ పిటీషన్ వేసారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పారు. ఎన్నికల కమీషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తమను సంప్రదించకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నాట్టు ప్రకటన చేసామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు ఈ నిర్ణయం విరుద్ధం అని అన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. హైకోర్టు మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గతంలోనే ఎన్నికలు నిర్వహణకు ఇబ్బంది ఏమిటి అని హైకోర్ట్ ప్రశ్నించింది. అయితే నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు నిర్వహించే అభిప్రాయం ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read