ఏపి ప్రభుత్వం, కీలక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. సీఆర్డీఏ, వికేంద్రీకరణ బిల్లులకి ఆర్డినెన్స్ తెస్తారు అని ప్రచారం జరుగుతున్న వేళ, మరో ఆర్డినెన్స్‌ తో ప్రభుత్వం ముందుకు రావటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయంలో, ఇంత తొందరగా హడావిడిగా, ఆర్డినెన్స్‌ ఎందుకు తెచ్చారు ? రేపు ఎలాగూ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, అందులో బిల్లు పెట్టుకో వచ్చు కదా అనే సందేహాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. చట్టంలో సవరణలపై గత కేబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగా నిర్ణయించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయించిన ప్రభుత్వం... స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ జారీ చేసింది.

govt 20022020 2

స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల జైలు, రూ.10 వేలు జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో పాల్గొనేలా ఆర్డినెన్స్ జారీ అయ్యింది. అయితే, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వెయ్యటం అనే దాని పై, చాలా సందేహాలు వస్తున్నాయి. ఇది ఎవరు నిర్ణయిస్తారు ? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీసులు అయితే, ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అది చేస్తారు కదా ? న్యాయస్థానాల్లో ఇలాంటివి నిర్ణయం తీసుకోవాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే దీని పై, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా, దీని పై అభ్యంతరం చెప్పారు. ఇలా అయితే ప్రతిపక్షం పై అభాండాలు వేసి, అనర్హత వేటు వేస్తారని అన్నారు.

govt 20022020 3

డబ్బు, మద్యం ఉండ కూడదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని, కాని ఇలా ఎవరు నిర్ణయం తీసుకుంటారో చెప్పకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీసులకే అవకాసం ఇస్తే, ఎవరి మీద పడితే వారి మీద, అబద్ధపు ప్రచారం చేసి, అనర్హత వేటు వేసే అవకాసం ఉందని, అంటున్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో, చట్ట సభల్లో చర్చించాలి కాని, ఇలా ఆర్డినెన్స్‌ ఇవ్వటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరో పక్క, ఎన్నికల ప్రక్రియని ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు అనే దానికి కూడా సమాధానం లేదు. 7 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేసే విధంగా ఆదేశాలు ఇవ్వటం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే, ఇలా హడావిడి పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read