ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మే 29న రమేష్ కుమార్ ని ఎన్నికల కమీషనర్ గా ఉండవచ్చు అంటూ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే హైకోర్ట్ లో స్టే పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా, ఈ రోజు ఆ స్టే పిటీషన్ ని ప్రభుత్వం వెనక్కు తీసుకుని. ఈ పరిణామం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాలు ఏమిటో అర్ధం కావటం లేదు. సుప్రీం కోర్ట్ లు కేసు వేసారు కాబట్టి, ఈ పిటీషన్ వెనక్కు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే, సుప్రీం కోర్ట్ లో కేసు వేసిన సమయంలోనే, హైకోర్ట్ లో కూడా ప్రభుత్వం పిటీషన్ వేసింది. ఆ సమయంలో అలా ఎందుకు చేసింది, ఇప్పుడు ఎందుకు వెనక్కు తీసుకుంది అనేది తెలియదు. హైకోర్ట్ లో స్టే పిటీషన్ ఉంటే, సుప్రీం కోర్ట్, కేసు అడ్మిట్ చేసుకోదు అని భావించిన ప్రభుత్వం, ఇలా చేసి ఉండవచ్చు అని, అందుకే హైకోర్ట్ లో వేసిన స్టే పిటీషన్ వెనక్కు తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక మరో పక్క, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కొనసాగనివ్వలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంచాయతీరాజ్ ఎన్నికల సంస్కరణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని తగ్గించామని చెప్తూ, అందుకు అనుగుణంగా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ కు అనుసరించి ఉత్తర్వులు జారీ చేసి అప్పటి వరకు ఎన్నికల కమిషనర్ గా వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలిగించింది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై విచారణ జరిపిన ఎస్ఈసి పదవీకాలాన్ని కుదిస్తూ ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను, జివోలను కొట్టివేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read