నిన్నటికి నిన్న చంద్రబాబు భద్రత పై వార్తలు వచ్చి, గందరగోళం అయిన నేపధ్యంలో, ఇప్పుడు తెలుగుదేశం మాజీ నేతలు అందరికీ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్న టీడీపీ నేతల భద్రత విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. ఎప్పుడూ లేని విధంగా మాజీ నేతలందరికీ ఒకేసారి భద్రత తొలగించటం సంచలనంగా మారింది. వినుకొండ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు ప్రభుత్వం గన్‌మెన్లను తొలగించింది. అంతే కాకుండా మిగతా మాజీ నేతలకు కూడా తొలగించింది. కేవలం టీడీపీ నేతలు అయిన కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావును మినహాయిస్తే, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అందరికీ ఉన్న గన్‌మెన్లను తీసివేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావులకు మాత్రం వన్‌ప్లస్ వన్ గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇదే విధంగా, సీనియర్ నేత , తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కూడా గన్‌‌మెన్లను తొలగించింది. ఇది ఇలా ఉంటే, ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం పై గుంటూరు జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వం కావాలనే, మాకు గన్‌మెన్లను తొలగించిందని ఆరోపిస్తున్నారు. జగన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నేతల భద్రత విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా కానీ ప్రస్తుతం, చంద్రబాబు కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం, పైలట్ క్లియరెన్సు వాహనాన్ని ఎత్తేసారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ వాహనాన్ని ఎలా తొలగించారో, జగన్ ప్రభుత్వం ఇతర టీడీపీ నేతల భద్రత విషయంలో కూడా ఇదే వైఖరిని కొనసాగిస్తుంది.

 

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read