ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో, ఆకస్మిక బదిలీలు, ఐఏఎస్ అధికారులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకంగా చీఫ్ సెక్రటరీనే బదిలీ చెయ్యటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సియం ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చిన, ఒక్క రోజులునే ఆయన్ను బదిలీ చేసి, అధికారులకు ఒక మెసేజ్ ఇచ్చారు జగన్. అప్పటి నుంచి అధికారులు హడలి పోతున్నారు. ముఖ్యంగా మాజీ చీఫ్ సెక్రటరీకి అనుకూలంగా ఉన్న కొంత మంది అధికారులు, తమకు కూడా బదిలీ ఉత్తర్వులు వస్తాయని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపధ్యంలోనే, మరో కీలక ఐఏఎస్ అధికారిని బదిలీ చేస్తూ, నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేవలం 24 గంటల్లోనే, ఆయన రెండు సార్లు బదిలీ అవ్వటం, ఐఎస్ఎస్ వర్గాల్లో చర్చనీయంసం అయ్యింది. ఎల్వీ సుబ్రమణ్యం, ప్రవీణ్ ప్రకాష్ మధ్య జరిగిన ఇష్యూలో, ఎల్వీ వైపు ఉన్న అడిషనల్ సెక్రటరీ గురుమూర్తి పై నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది, అందరినీ ఆశ్చర్యపరిచింది.

lvs 09112019 2

గురుమూర్తిని బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీనికి సంబందించిన ఆదేశాలు కూడా ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. ప్రస్తుతం గురుమూర్తి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అదనపు సెక్రటరీగా పని చేస్తున్నారు. గురుమూర్తి స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్‌‌ అధికారి క్రైస్ట్ కిశోర్‌ కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ప్రవీణ్ ప్రకాష్‌కు, ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ ఇవ్వటం వెనుక గురుమూర్తి ప్రమేయం కూడా ఉన్నట్టు, సచివాలయంలో ప్రచారం జరుగుతుంది. అదీ కాక, తాను ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పని చేయలేక పోతున్నాను అంటూ, గత నెల 30న, గురుమూర్తి, చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాసారు. తాను ఆయన కింద పని చేయలేను అని, తనని వేరే శాఖకు బదిలీ చెయ్యాలని అప్పట్లో కోరారు.

lvs 09112019 3

అయితే గురుమూర్తిని, 24 గంటల్లో, రెండు సార్లు బదిలీ చెయ్యటం కూడా చర్చనీయంసం అయ్యింది. గురువారం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు నుంచి, బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. అయితే 24 గంటలు కూడా గడవక ముందే, గురుమూర్తి డిప్యుటేషన్‌ రద్దు చేసి దిల్లీకి పంపించి వేస్తూ, ప్రవీణ్‌ ప్రకాశ్‌ శుక్రవారం మరో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గురుమూర్తి, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖలో డైరెక్టర్‌ హోదాలో పని చేసే వారు. అయితే చంద్రబాబు హయంలో, 2017 జూన్‌ 1న డిప్యుటేషన్‌ పై రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. వచ్చిన కొత్తలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకి ఓఎస్‌డీగా పనిచేసేరు. తరువాత అక్కడ నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో, అదనపు కార్యదర్శిగా పని చేసావారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ దగ్గర పని చెయ్యలేక ఇబ్బందులు పడుతూ, చివరకు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉత్తర్వులు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read