రాజధాని రైతులు అనేక పిటీషన్ల రూపంలో, హైకోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ప్రతి రోజు విచారణ జరుగుతుందని, అందరూ భావించారు. అయితే ఈ రోజు టెక్నికల్ సమస్యలు రావటంతో, విచారణను హైకోర్టు అక్టోబర్ 5 కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విచారణలో వచ్చిన అంశాల పై హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు, మీడియాకు వివరించారు. ఈ రోజు నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం అవుతుందని, న్యాయవాదులు అందరూ వచ్చాం అని కానీ, ఈ రోజు కొన్ని సాంకేతిక కారణాల వల్ల కుదరలేదని అన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కోర్టులోనే విచారణ చెయ్యటం సాధ్యం కాదని, ఆన్లైన్ లోనే విచారణ చెయ్యాలని, కొంత మంది న్యాయవాదులు కోరారు. అయితే ఈ అంశం పై, ఎక్కువ పిటీషన్లు ఉన్నాయి కాబట్టి, ప్రతి పిటీషన్ పై, కోర్టులో విచారణ చెయ్యాలంటే, ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం అని, చాలా సమస్యలు వస్తాయని, ఇంకా కోర్టులోనే విచారణ చెయ్యాలి అంటే, లోకల్ గా ఉండే వారిని కోర్టు కు పిలిచి, బయట నుంచి వచ్చే వారికి ఆన్లైన్ లోనే విచారణ చేసే హక్కు ఇవ్వాలని, కొంత మంది న్యాయవాదులు, కోర్టుని కోరారు.

అయితే ఈ అమరావతి పిటీషన్ల పై రకరకాల పిటీషన్లు ఉన్నాయని, అన్నీ ఒకే గాటిన కాకుండా, విభజన చేసి ఈ కేసులు విచారణ చెయ్యాలని కూడా కొంత మంది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక ఈ రోజు విచారణ గురించి మాట్లాడుతూ, స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చినా విశాఖలో గెస్ట్ హౌస్ కడుతున్నారు అనే అంశం పై, కంటెంప్ట్ అఫ్ కోర్ట్ వెయ్యటంతో, దాని పై కౌంటర్ దాఖలు చెయ్యమని గతంలో కోర్ట్ చెప్పింది. అయితే ఈ రోజు కౌంటర్ దాఖలు చెయ్యలేం అని, మరి కొంత సమయం కావాలని చీఫ్ సెక్రటరీ కోర్టుకు తెలిపారు. ఇదే సందర్భంలో అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, విశాఖలో గెస్ట్ హౌస్ కి రాజధానికి సంబంధం లేదని, అక్కడ రాజధానికి వెళ్ళినా వెళ్లకపోయినా, గెస్ట్ హౌస్ కడతామని తెలిపారు. అయితే ఇవన్నీ పరిశీలించిన న్యాయస్థానం, అక్టోబర్ 5 కు కేసుని వాయిదా వేసింది. అక్టోబర్ 5 వరకు స్టేటస్ కో ఉంటుందని, అక్టోబర్ 5 న పరిస్థితిని బట్టి, కోర్టులోనే విచారణ చేస్తామా లేదా అనేది, ఆ రోజు పరిస్థితిని బట్టి చెప్పే అవకాసం ఉంది. పరిస్థితి అనుకూలిస్తే, అక్టోబర్ 5 నుంచి రోజు వారీ విచారణ చేసే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read