ఈ రాష్ట్రం 2014లో కట్టుబట్టలతో, అప్పులతో, రాజధాని లేకుండా రోడ్డున పడితే, మనకు ఒక అడ్డ్రెస్ ఇచ్చేలా చేసి, మనకు ఒక రాజధాని కోసం, ఈ రాష్ట్ర నడిఒడ్డులో అమరావతి అనే రాజధాని పెట్టుకోవటానికి, అక్కడ రైతులు భూములను త్యాగం చేసారు. ఈ రాష్ట్రంతో పాటుగా, తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారు. 2019 వరకు అంతా సాఫీగానే సాగినా, తరువాత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాత నుంచి, మళ్ళీ ఏపి రాజధాని అడ్డ్రెస్ ఏమిటి అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజధాని రైతులు ఆందోళన బాట పట్టారు, గంటలు, రోజులు, వారాలు, నెలలు అయిపోయి, ఇప్పుడు సంవత్సరాల దాకా వస్తుంది, వ్యవహారం. ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది ఈ ఉద్యమం మొదలు పెట్టి. అయితే ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు. దీంతో వారు ఇప్పుడు మరో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రాష్ట్రం అంతా తమ కష్టాలు తెలిసేలా. న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ, సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి, అమరావతిలోని హైకోర్టు దగ్గర నుంచి, తిరుపతిలో ఉన్న వెంకన్న గుడి వరకు మహా పాదయాత్ర చేయాలని అమరావతి రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను కోరారు.

dgp 26102021 2

ఈ అనుమతి కోసం ఈ నెల 11న, అలాగే 12న, 14న కూడా వారు డీజీపీకి అనుమతి ఇవ్వాలని లేఖలు రాసారు. అయితే గడువు సమీపిస్తూ ఉండటం, సమయం దగ్గర పడుతూ ఉండటంతో, ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవటంతో, రాజధాని రైతులు కోర్టుని ఆశ్రయించారు. మా లేఖ పై, డీజీపీ స్పందించేలా చూడాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటికే రూట్ మ్యాప్ తో పాటుగా, అన్ని రకాల సమాచారం పోలీసులకు ఇచ్చాం అని కోర్టుకు తెలిపారు. రైతుల పిటీషన్ పై స్పందించిన హైకోర్టు, ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలో, పోలీస్ శాఖ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకున్నారో తమకు తెలియ చేయాలని డీజీపీని ఆదేశించింది. అయితే దీని పై స్పందించిన హోం శాఖ తరుపున హాజరు అయిన న్యాయవాది, తాము రూట్ మ్యాప్ ఇచ్చిన విధంగా, అన్ని జిల్లా ఎస్పీల నుంచి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నాం అని, ఎస్పీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా, తాము త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కోర్టుకు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read