రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకి, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం పై, ఈ రోజు రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి, మరో న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పై ఈ రోజు విచారణ జరిపింది. గత విచారణ సందర్భంగా, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, అలాగే స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఎండీ ఇరువురినీ కూడా ఈ రోజు హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ రోజు ఇరువురి అధికారులు కూడా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు హాజరు అయ్యారు. గతంలో గుంటూరు జిల్లా మాచర్ల, మరో చోట, చెత్త నుంచి సంపద తాయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేయటమే కాకుండా, అందులో ఉపయోగించే విద్యుత్ మోటార్లకు కూడా వైసీపీ రంగులు వేయటం పై, కృష్ణా జిల్లాలోని జై భీమ్ ఆక్సిస్ అధ్యక్ష్యుడు సురేష్, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ రోజు అధికారులు హైకోర్ట్ విచారణకు హాజరైన సందర్భంగా, ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

dvivedi 16092021 2

గతంలో రంగులు వేయటం పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు, అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఈ రెండు తీర్పులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తుందని అని చెప్పి హైకోర్టు నిలదీసింది. కోరు ఆగ్రహంతో అధికారులు దిగి వచ్చారు. దీని పై మూడు వారాల్లో లోపుగానే రంగులు అన్నీ తొలగిస్తామని కోర్టుకు తెలిపారు. దీనికి హైకోర్టు అంగీకరిస్తూ, అక్టోబర్ 6వ తేదీ లోగా రంగులు అన్నీ తొలగించారని ఆదేశాలు ఇచ్చింది. రంగులు తొలగించిన తరువాత, తమకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికే కాదని, పిటీషనర్ కూడా రంగులు తొలగించారో లేదో, తమకు తెలపాలి అంటూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలోనే ఆదేశాలు ఉన్నా, మళ్ళీ కోర్టు తీర్పు ధిక్కరించి రంగులు వేయటం పై, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో, ప్రభుత్వం పై ఏమైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. కోర్టులు చెప్తున్నా, ప్రభుత్వం వినకపోవటం పదే పదే ఇలాంటి కేసులు రావటం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read