ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు మాన్సాస్ ట్రస్ట్ ఈవో పై, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించకపోవటమే కాకుండా, వాటిని ఉల్లంఘించటం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఉండటం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవో కావాలని ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, హైకోర్టు ఆదేశాలు పాటించటం లేదని, మాన్సాస్ చైర్మెన్ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై నిన్న విచారణ జరిగి, ఈ రోజుకు వాయిదా పడింది. ఈ రోజు విచారణ సందర్భంగా అశోక్ గజపతి రాజు తరుపు న్యాయవాదులు, సీతారామమూర్తి, అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు సందర్భంగా హైకోర్టు మాన్సాస్ ఈవోని నిలదీసింది. ఈవో పాత్ర ఏమిటి, ఈవో బాధ్యతులు ఏమిటి, పరిమితులు ఏమిటో కూడా చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలోనే హైకోర్టు ఆర్డర్ ను మీరు ఎందుకు అమలు చేయలేక పోతున్నారో చెప్పాలని, ఈవోని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు ఇక నుంచి ఈవో, చైర్మెన్ ఏవైతే ఆదేశాలు ఇస్తారో, ఆ ఆదేశాలు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే అని హైకోర్ట్ స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఒకసారి చదువుకోవాలని అని, గతంలో ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వర రావు, చైర్మెన్ కు లెటర్లు రాసే ముందు ఇష్టం వచ్చినట్టు రాయవద్దు అని చెప్పి, హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

eo 27072021 2

హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని పూర్తిగా చదివి, దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాత మాత్రమే లేఖలు రాయాలని చెప్పి, స్పష్టం చేసింది. అయితే ఈ సందర్భంగా ఆడిట్ పేరుతో, ఎవరు ఎవరో వచ్చి, మాన్సాస్ ట్రస్ట్ లో రికార్డులు పరిశీలిస్తున్నారని, ఇది సమంజసం కాదని, ఇది నిబంధనలకు విరుద్ధం అని, అశోక్ గజపతి రాజు తరుపు న్యాయవాదులు ఇద్దరూ కూడా రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆడిట్ తో ఈవోకి సంబంధం ఏమిటి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఆ జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే , ఆడిట్ నిర్వహించేందుకు అర్హుడని, ఆయనకు మాత్రమే రికార్డులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ అశోక్ గజపతి రాజు ఇచ్చే ఆదేశాలు అన్నీ కూడా అమలు చేసి తీరాలని హైకోర్టు స్పష్టం చేస్తూ, ఈవో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఈవోని కోర్టు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read