టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి బెయిల్ పిటీషన్ వాదనలు సందర్భంగా హైకోర్టు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధంగా పాలన అంటే గౌరవం లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టుని, న్యాయమూర్తులను, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని బూతులు తిడుతుంటే, కనీసం స్పందించని పోలీసులు, ముఖ్యమంత్రిని తిట్టారు అనగానే, పట్టాభిని అరెస్ట్ చేసేంత ఉత్సాహం, జడ్జిలను తిట్టిన వారి విషయంలో ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రతిష్టలు, గౌరవాలు ముఖ్యమంత్రికే కాదని, అందరికీ ఉంటాయాని కోర్టు తెలిపింది. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులు పైన ఉందనే విషయం గుర్తు పెట్టుకోవాలి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. చట్టం ముందు అందరూ సమానమే అని, హోదాలను బట్టి చట్టం మారదని, ముఖ్యమంత్రి అయినా ఎవరు అయినా చట్టం ముందు సమానమే అని కోర్టు తెలిపింది. పోలీసుల వ్యవహార శైలిపై, కోర్టు ముందు అనేక పిటీషన్లు నమోదు అవుతున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. పట్టాభి అరెస్ట్ విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదు అంటూ కోర్టు పోలీసులను ప్రశ్నించింది. రిమాండ్ రిపోర్ట్ లో అన్నీ తప్పుల తడకలు ఉన్నాయని, ఒక పక్క మేము పట్టాభిని అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్ళామని రిమాండ్ రిపోర్ట్ లో రాసారని కోర్టు తెలిపింది.

hc 24102021 2

మరో పక్క ఏమో సెక్షన్‌ 41ఏ నోటీస్ ఇచ్చాం అని, ఆయన సహకారం అందించలేదు కాబట్టి, అరెస్ట్ చేసాం అని అంటున్నారు. రెండూ విరుద్ధమైన వ్యవహారాలు అని, రిమాండ్ రిపోర్ట్ రాసిన అధికారికి ఇది ఆత్మహత్యాసదృశంలా కనపడటం లేదా అని కోర్టు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న తప్పులను ఎత్తి చూపింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వ్యవహారం ఉందని కోర్టు తెలిపింది. అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే, 41ఏ నోటీస్ ఎందుకు ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. నోటీస్ ఇచ్చాం అని అంటున్నారని, మరి నోటీస్ ఇస్తే, అరెస్ట్ చేయాలి అంటే, మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకునే అరెస్ట్ చేయాలి కదా అని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించారో లేదో తెలపాలని, అఫిడవిట్ వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. వాళ్ళు మాట్లాడింది, తప్పా ఒప్పా అనేది చెప్పటం లేదని, కానీ ప్రతి దానికి ఒక విధానం ఉంటుందని, ఆ విధానం ప్రకారం పోలీసులు ప్రవర్తించారా లేదా అనేది ఇక్కడ చర్చ అని, ఒకరి విషయంలో ఒకలా, మరొకరి విషయంలో ఒకలా ఉండదని, హోదాలు చట్టం ముందు ఉండవని, అందరికీ చట్టం ఒకటే అని కోర్టు తెలిపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read