నిన్న హైకోర్టులో హెబియస్‌ కార్పస్ పిటీషన్ల పై విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా, రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందో లేదో తేలుస్తాం అంటూ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపధ్యంలో, నిన్న జరిగిన విచారణ ఆసక్తి కలిగించింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన హైకోర్టు ధర్మాసనం, ఈ వ్యాఖ్యలు చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక న్యాయవాదిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అంటూ దాఖలు అయిన పిటీషన్ ను మంగళవారం విచారణలో చేర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు మాట్లాడుతూ, ఈ మొత్తం హెబియస్‌ కార్పస్ పిటీషన్లను పరిగణలోకి తీసుకుని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందో లేదో తమ వాదనల్లో చెప్పాలని, న్యాయవాదులని కోర్టు ఆదేశించింది. దంపతులను అక్రమంగా నిర్బంధించారు అంటూ దాఖలు అయన పిటీషన్ సందర్భంగా, ఆ పిటీషన్ ఉపసంహరించుకోవాలి అంటూ, పిటీషన్ వేసిన న్యాయవాదిని పోలీసులు బెదిరించారు అంటూ పిటీషన్ లో తెలిపిన వాటి పై, ప్రభుత్వం తరుపున ప్రత్యేక కౌన్సిల్ ఈ కేసుని వాదించారు.

తాము ఎవరినా నిర్బంధించలేదని అన్నారు. ఆ న్యాయవాది ఇంట్లో పోలీసులు తనిఖీ చేసిన మాట వాస్తవమే అని, కానీ కేసు కేసుకు దానికి సంబంధం లేదని, అది వేరే కేసుకు సంబంధించి, పోలీసులు ఆ న్యాయవాది ఇంట్లో సోదాలు చేసారని కోర్టుకు తెలిపారు. న్యాయవాది పై కేసు ఉపసంహరించుకోమని ఎలాంటి ఒత్తిడులు తేలేదని తెలిపారు. జరిగిన ప్రాసెస్ లో కొన్ని లోపాలు ఉన్నాయని, అయితే అది కావాలని చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా చేసిన జ్యుడీషియరీ విచారణ కూడా సరిగా లేదని వాదనలు వినిపించారు. అయితే దీని పై స్పందించిన కోర్టు, జ్యుడీషియరీ రీవిచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని పిటీషనర్ తరుపు వారు చెప్తుంటే, మీరు మాత్రం దానితో ఒప్పుకోవటం లేదు కాబట్టి, దీని పై స్వతంత్ర సంస్థతో ఎంక్వయిరీ చేయమని కోరతామని , స్వతంత్ర సంస్థతో ఎందుకు ఎంక్వయిరీ చేయకూడదో చెప్పాలని కోరారు. అయితే పోలీస్ ఉన్నతాధికారులు ఎవరూ ఇందులో లేరు కాబట్టి, అవసరం లేదని ప్రభుత్వ తరుపు న్యాయవాది చెప్పగా, విచారణ ఈ రోజుకి వాయిదా పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read