నరేగా బిల్లులకు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. సుమారుగా 494 పిటీషన్ల పై గతంలో హైకోర్టు, ఈ రోజు లోగా బిల్లులు చెల్లించాలని, దానికి సంబంధించిన వివరాలను, అటు పిటీషనర్ తరుపు న్యాయవాదులతో పాటు, ఇటు ప్రభుత్వం కూడా, కోర్టుకు తెలపాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు, ఈ కేసులకు సంబంధించి, ఈ రోజు మళ్ళీ ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది, నరేగా బిల్లులకు సంబంధించి అనేక కేసుల్లో విజిలెన్స్ విచారణ జరుగుతుందని చెప్పి, హైకోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. దీని వల్లే తాము బిల్లులు చెల్లించ లేక పోతున్నాం అని, ఏ కేసుల్లో అయితే విజిలెన్స్ విచారణ పూర్తి అయ్యిందో, అటువంటి కేసులలో 20 శాతం మినహాయించి బిల్లులు చెల్లించామని, హైకోర్టుకు మోఖికంగా చెప్పారు. అయితే దీనికి సంబంధించి, రాత పూర్వకంగా తమకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పిటీషనర్ తరుపు న్యాయవాదులు, అసలు తమ క్లైంట్ల పై విజిలెన్స్ విచారణ అనేది జరగటం లేదని, ఒకవేళ విచారణ జరిగితే తమ క్లైంట్లకి నోటీసులు ఇవ్వకుండా, ఎలా విచారణ చేస్తారు అంటూ అని ప్రశ్నించారు.

hc 15092021 2

తమకు డబ్బులు కూడా చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా, గత ఏడాది అక్టోబర్ లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చిందని, అందులో విజిలెన్స్ విచారణ పూర్తయ్యిందని, బిల్లులు చెల్లిస్తామని తెలిపారని కోర్టుకు చెప్పారు. దీంతో హైకోర్టు ఒక్కసారిగా ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రతి సారి వాయిదాలు కోరటం, జాప్యం చేయటం పట్ల, పిటీషనర్లు జీవించే హక్కు కోల్పోతున్నారని, కోర్టు చెప్పింది. అధికారులను గతంలో పిలిచినప్పటికి కూడా ఎటువంటి మార్పు రాలేదని, అందు వల్ల, వచ్చే నెల నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కోర్టు ముందుకు హాజరు కావలి అంటూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు చీఫ్ సెక్రటరీ హాజరు అయ్యే రోజు, పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని, కోర్టు ముందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాస్తవాలు చెప్పాలని కోర్టు ఆదేశాలు జరీ చేసింది. దీంతో ఇప్పుడు ఈ కేసు కూడా హాట్ టాపిక్ అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read