తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్డీవో కార్యాలయం సాక్షిగా జరిగిన ఒక భూమి,రెండు చెల్లింపులు కేసులో శుక్రవారం కీలక మలుపు చోటుచేసుకుంది. రూ.3.25 కోట్ల అదనపు చెల్లింపుల విషయంలో ఆర్డీవో కార్యాలయం వహించిన నిర్లక్ష్యం వెలుగులోకి తేవడంతో రెవిన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయకుండా నిందితులైన రామసుబ్రహ్మణ్యం, రాజారావులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విడిచి పెట్టకపోవడం పై అతని బంధువు గంటశాల భాను ప్రకాష్ గురువారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అవకతవకలపై ఎటువంటి నివేదికలు తయారు చేయకుండా కేవలం తమ బంధువులైన పచ్చిపులుసు శ్రీరామ్మూర్తి, పచ్చిపులుసు రవితేజ, సుతాపల్లి సత్యనారాయణ, సుతాపల్లి సాయి, కొమ్మిశెట్టి భీమశంకరంలను అయినవిల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి వేధిస్తున్నారని భానుప్రకాష్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

దీనిని రిట్ పిటిషన్ నెం 10888/2020 క్రింద కోర్టు పరిగణలోకి తీసుకుని శుక్రవారం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన కౌంటర్‌ను హైకోర్టు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సంబంధం లేని వ్యక్తులను వేధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఈ నెల 24వ తేదీన డీజీపీ గౌతమ్ సవాంగ్ ను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాలు సమయం ఇచ్చింది. ఇప్పటికే డీజీపీ మూడు సార్లు, హైకోర్టు ముందుకు వెళ్లారు. మొదటి సారి హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో, రెండో సారి చంద్రబాబుకి 151 నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకోవటం పై, మూడో సారి అక్రమ మద్యం రవాణా చేస్తున్న వాహనాలు విడుదల విషయంలో అనుసరిస్తున్న విధానం పై, ఇలా మూడు సార్లు డీజీపీ కోర్టు ముందు హాజరు అయ్యారు. ఇప్పుడు మరో సారి డీజీపీ హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read