ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో సంచలన ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆడియో టేప్ కొన్ని రోజుల క్రిందట బయట పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం, చిత్తూరు జిల్లాలో ఒక జడ్జి అయిన రామకృష్ణను అధికార పార్టీ నేతలు ఇబ్బందులు పెట్టటం లాంటివి కొన్ని రోజులుగా చూస్తున్నాం. ప్రభుత్వానికి ఇబ్బంది రావటంతో, రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్యతో ఫోన్ లో మాట్లాడారు. జస్టిస్ ఈశ్వరయ్య, ప్రస్తుతం ఏపి ప్రభుత్వంలో పని చేస్తున్నారు. అలాగే నెల రోజులు క్రిందట, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీసి సంఘం నుంచి, హైకోర్టు చీఫ్ జస్టిస్ వల్లే, హైకోర్టు రిజిస్టార్ కరోనా వచ్చి చనిపోయారు అంటూ, రాష్ట్రపతికి లేఖ రాసారు. ఇవన్నీ పక్కన పెడితే, మేజిస్ట్రేట్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణలో, జస్టిస్ ఈశ్వరయ్య, చేసిన కొన్ని వ్యాఖ్యలు న్యాయముర్తులను, అలాగే హైకోర్టు పై కుట్ర పన్నేలా ఉన్నాయి అంటూ, రామకృష్ణ హైకోర్టులో ఇప్పటికే హైకోర్టు పై కుట్ర పన్నారు అనే కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేసారు. ఇది గత సోమవారం విచారణ చేసిన కోర్టు, ఈ రోజుకి వాయిదా వేసింది.

అయితే ఈ రోజు, ఇంప్లీడ్ పిటీషన్ పై నిర్ణయం చెప్పే ముందు, రామకృష్ణ చెప్తున్న విషయాలు నిజమా కాదా అనే విషయం పై తేల్చటానికి, హైకోర్టు, జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ తో పాటు, నిజంగానే హైకోర్టు పై కుట్ర జరిగిందా అనే విషయం పై తేల్చటానికి, సుప్రీం కోర్టు మాజీ జడ్జితో విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా సుప్రీం మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ ను హైకోర్టు నియమించింది. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు కూడా సహకరించాలని కోరింది. కుట్రను ఛేదించి తమకు, నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ టేపులు నిజమా కదా అనే తేల్చటంతో పాటుగా, కుట్రను ఛేదించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ విచారణ చేసిన తరువాత, రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ పై నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. అలాగే సుప్రీం కోర్టు జడ్జి ఇచ్చిన నివేదిక కనుక ఈ టేపులు నిజం అని చెప్తే, పూర్తీ స్థాయిలో ఈ విషయం తేల్చటానికి, సిబిఐ కూడా అప్పగించే అవకాసం ఉందని, కొంత మంది న్యాయవాదులు చెప్తున్నారు. మరి విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read