విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మీద దాడి చేసి, అరెస్ట్ చెయ్యటం, ఆ తరువాత పిచ్చి హాస్పిటల్ లో పడేయటం పై, యావత్తు దేశం ఆశ్చర్య పోయింది. దేశం మొత్తం డాక్టర్లు చేస్తున్న సేవలకు, పూల వర్షం కురిపిస్తుంటే, ఇక్కడ మాత్రం, ఒక డాక్టర్ ని రోడ్డున పడేసి, చొక్కా లేకుండా, పెడ రెక్కలు విరిచి, తాళ్ళతో చేటుకు కట్టేసి, ఎత్తి ఆటోలో పడేయటం, ఇవన్నీ చూసిన ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. మాస్కులు అడిగిన డాక్టర్ ను ఇలా చెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. ఈ నేపధ్యంలో, ఈ మొత్తం వ్యవహారం పై, హైకోర్ట్ ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. దీని పై విచారణ ప్రారంభించి, డాక్టర్ సుధాకర్ ని తమ ముందు హాజరు పరచాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే, సుధాకర్ ని హాజరు పరచటం కుదరదు అని, ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని, వీడియో కాన్ఫరెన్స్ లో హాజరు పరుస్తాం అంటూ, ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే సుధాకర్ తరుపు న్యాయవాది ఇందుకు ఒప్పుకోలేదు.

ఆయనకు దెబ్బలు ఉన్నాయని, అందుకే కోర్ట్ ముందు హాజరు పరచటం లేదు అని, ఆయన వద్దకు న్యాయవాదిని పంపి, ఆయన దెబ్బలు పరిశీలించి, ఆయన వాంగ్మూలం కూడా నమోదు చెయ్యాలని కోరారు. దీంతో మొన్న విశాఖ జిల్లా జడ్జి, సుధాకర్ వద్దకు వెళ్లి, ఆయన నుంచి రెండు గంటల పాటు వాంగ్మూలం తీసుకున్నారు. మరో పక్క, ఇదే కేసులో, ప్రభుత్వం కూడా తమ నివేదికను కోర్ట్ కు సమర్పించింది. ఈ నేపధ్యంలో, ఈ కేసు పై, ఈ రోజు విచారణ జరిగింది. విశాఖ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ లో, డాక్టర్ సుధాకర్ కు దెబ్బలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లో మాత్రం, ఎక్కడ దెబ్బలు గురించి ప్రస్తావన చెయ్యలేదు. దీంతో, రెండు రిపోర్టుల్లో తేడా ఉండటంతో, హైకోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. ఎనిమిది వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని, సిబిఐ కి హైకోర్ట్ తెలిపింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో ఏదో దాస్తున్నారు అని కోర్ట్ భావించ బట్టే, కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసు విషయంలో, ఏదో ఉంది అని, ఈ విషయం ఆషామాషీ విషయం కాదని, ఇంత వరకు ఎందుకు వచ్చిందో అనే అనుమానం ఉండబట్టే, కోర్ట్ సిబిఐకి విచారణ చెయ్యమని కోరినట్టు చెప్పి ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే నిన్న సుధాకర్ తల్లి కూడా, తమకు ఫోనులు వస్తున్నాయని, మీ కొడుకు ఉద్యోగం ఇచ్చేస్తాం, ఇంకా మాట్లాడకండి అని చెప్పినట్టు, ఆవిడ నిన్న ఇంటర్వ్యూ లో చెప్పారు. అయితే ఈ రోజు కోర్ట్ సిబిఐకి ఇవ్వటం కీలక పరిణామం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read