ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరణకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణకు సంబంధించి, ఏవైతే అసెంబ్లీలో ఆమోదించిందో, అవే హైకోర్టులో అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. ఈ రోజు దాని పైన, హైకోర్టులో విచారణలో జరిగింది. రైతుల తరుపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, అలాగే మరో సీనియర్ న్యాయవాది ఆదినారయణ రావు వాదనలు వినిపించగా, ప్రభుత్వం వైపు నుంచి అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. వాడీ వేడిగా ఈ రోజు వాదనలు కొనసాగాయి. అయితే ఈ బిల్లులు ఉపసంహరణ సందర్భంగా శాసనసభలో పెట్టిన ఈ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి కానీ పేర్కొన్న అంశాలను ఈ సందర్భంగా పిటీషనర్ తరుపున న్యాయవాది వాదించారు. మూడు రాజధానులు కొనసాగిస్తామని, కేవలం టెక్నికల్ కారణాల వల్లే, మూడు రాజధానులు బిల్లులు ఉపసంహరించుకుంటున్నామని శాసనసభ వేదికగా మంత్రి, ముఖ్యమంత్రి చెప్పారని, బిల్లులు కూడా అదే విషయాన్ని పొందు పరిచారని కోర్టుకు తెలిపారు. అటువంటి అప్పుడు, ఏదైతే మేము మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది కాబట్టి, అమరావతి రాజధాని అని చెప్తున్నా కూడా, మూడు రాజధానులు మళ్ళీ తీసుకుని వస్తాం అని చెప్తున్నప్పుడు, ఈ పిటీషన్లు నిర్వీర్యం కావు, ఈ పిటీషన్ల పై విచారణ కొనసాగించాలని శ్యాం దివాన్ వాదనలు వినిపించారు.

hc 29112021 2

అయితే ఈ నేపధ్యంలో హైకోర్టు, ఒక కీలక పాయింట్ లేవనెత్తింది. రాష్ట్ర అభివృద్ధికి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు అడ్డుగా ఉన్నాయనే భావన ప్రజల్లోకి వెళ్తుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే దీనికి న్యాయవాదులు స్పందిస్తూ, ఎక్కడ అభివృద్ధికి అడ్డు వస్తుందో వాటి మీద మాత్రమే స్టేటస్ కో ఎత్తి వేయాలని, రాజధాని కార్యాలయాల తరిలింపు విషయంలో మాత్రం ఉత్తర్వులు అలాగే ఉంచాలని కోరారు. ఈ నేపధ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని, బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయి కాబట్టి, గవర్నర్ వద్ద సంతకం చేసి, గజిట్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత దీని పై మరింత చర్చిద్దాం అని హైకోర్టు అభిప్రాయ పడింది. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అంశాల పై మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తున్నాం అని, కానీ కార్యాలయాల తరలింపు పై మాత్రం స్టేటస్ కో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ వద్ద నుంచి గజిట్ నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఈ కేసు విచారణ మళ్ళీ చేపడతాం అని చెప్తూ, కేసుని వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య కూడా చేసింది. మూడు రాజధానులు బిల్లు తెచ్చినప్పుడు కానీ, ఉపసంహరణ అప్పుడు కానీ, రెండు సార్లు, కేవలం ఒక్క రోజులో హడావిడిగా క్యాబినెట్, అసెంబ్లీలో ఆమోదం పొందాయని, ఎక్కడ చర్చ జరిగిందని కూడా ప్రశ్నించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read