ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగలకుండా మాత్రం ఆగటం లేదు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోని హైకోర్టు ఈ రోజు కొట్టేసింది. కరోనా కారణంగా ఆదాయం లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో 50 శాతం జీవో ఇస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే సమయంలో, మిగతా పేమెంట్లు మాత్రం ఆపలేదని, కాంట్రాక్టర్లకు భారీ పేమెంట్లు చేసారని, ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే 50 శాతం జీతాలు ఇవ్వటం పై, విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి ఒక పిటీషన్ వేసారు. దీని పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పడ్డ 50 శాతం బకాయలు చెల్లించాలని, అంతే కాకుండా, వీటికి 12 శాతం వడ్డీ జోడించి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. రెండు నెలల్లో చెల్లింపులు జరపాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో జారీ చేసిన జీవోని హైకోర్టు కొట్టేసింది.

అయితే ప్రభుత్వానికి మాత్రం కోర్టుల్లో ఇబ్బందులు తగులుతూనే ఉన్నాయి. ఏపి ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జీవోలు, బిల్లులు చేస్తూ ఉండటం, రూల్ అఫ్ లా పక్కన పెడుతున్నారని ఆరోపణలు రావటంతో, చాలా సందర్భాల్లో కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకత వస్తుంది. హైకోర్టు మీద వైసీపీ నేతలు కోపం చూపిస్తున్నా, సుప్రీం కోర్టుకు వెళ్ళినా అక్కడ కూడా ఎదురు దెబ్బలే. ప్రభుత్వం చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టే, ఎక్కడా ఊరట దొరకటం లేదు. పైగా సుప్రీం కోర్టు, మాకు ఏపిలో ఏమి జరుగుతుందో అంతా తెలుసు అని వ్యాఖ్యానించింది అంటే, అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ భవనాలకు ఎవరైనా పార్టీ రంగులు వేసుకుంటారా ? చట్టంలో ప్రాంతీయ భాషలో విద్యబోధన ఉండాలని ఉంటే, ఆప్షన్ లేకుండా మొత్తం ఇంగ్లీష్ మీడియం ఎవరైనా పెడతారా ? తెలుగు మీడియం ఆప్షన్ పెడితే ఏమి అవుతుంది ? అలాగే రైతులు ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే, అది కాదని, అమరావతి నుంచి వెళ్ళిపోతే చెల్లుతుందా ? ఇక నిమ్మగడ్డ, డాక్టర్ సుధాకర్, వైఎస్ వివేక లాంటి కేసులు సంగతి తెలిసిందే. మారాల్సింది ప్రభుత్వ వైఖరే కదా.

Advertisements

Advertisements

Latest Articles

Most Read