ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో ఫలితాలు వచ్చి, రేపటి నుంచి ఇంటర్వ్యూ లు ప్రారంభం కావలసిన నేపధ్యంలో, ఈ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహణ, వాల్యుషన్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, గత కొన్ని రోజులుగా దీని పై అనేక మంది అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని పై కొంత మంది అభ్యర్ధులు, అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పరీక్షలు రద్దు చేయాలి అంటూ, హైకోర్టుని ఆశ్రయించారు. ఈ ఒక్క అంశం పైనే, దాదాపుగా 40 వరకు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఈ అంశం పై ఈ రోజు హైకోర్టులో సుదీర్ఘంగా విచారణా జరిగింది. ఈ పిటీషన్లపై ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరు పక్షాలు హోరాహోరీగా వాదనలు వినిపించాయి. ప్రభుత్వం వైపు నుంచి సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, మధ్యంతరంగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్షలు నిర్వహణలో అవకతవకలు జరిగాయని చెప్పి, హైకోర్టు ప్రాధమిక నిర్ధారణకు వచ్చిందా అనే అనుమానం కలిగేలా, హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో, కీలక విషయాలు ఉన్నాయి.

hc 16062021 2

వచ్చే నాలుగు వారాల వరకు, ఈ పరీక్షలకు సంబంధించి, తదుపరి చర్యలు ఏవి కూడా తీసుకోకూడదు అంటూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇంటర్వ్యూ లు కూడా ఆగిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాలు, మ్యాన్యువల్ గా కాకుండా, డిజిటల్ పద్దతిలో వాల్యుషన్ చేసారని, దీనిలో అక్రమాలు కూడా జరిగాయని, ఈ ప్రక్రియ వల్ల అనేక మంది ప్రతిభ కలిగిన విద్యార్ధులకు కూడా అన్యాయం జరిగింది అంటూ, కొంత మంది విద్యార్ధులు హైకోర్టుని ఆశ్రయించారు. అంతే కాకుండా, గతంలో నిర్వహించిన కొన్ని పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఈ సారి తక్కువ మార్కులు వచ్చాయని, కేవలం కొంత మంది వ్యవహరించిన తీరు వల్లే, విద్యార్ధులకు అన్యాయం జరిగిందని, హైకోర్టులో వాదించారు. ఈ నేపధ్యంలోనే, హైకోర్ట్ ఆదేశాలు ఇస్తే, నాలుగు వారాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ `స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read