చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అకడ ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో అత్యవసర హౌస్‍మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. చిత్తూరు కార్పొరేషన్ లో ఉన్న, 18 డివిజన్లలో, టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఫోర్జరీ చేసి, విత్ డ్రా చేశారని హైకోర్టులో పిటీషన్ వేసారు. అయితే ఈ హౌస్‍మోషన్ పిటీషన్ ను,18 మంది టీడీపీ అభ్యర్థులు దాఖలు చేయటం మరో కొసమెరుపు. హైకోర్టు కూడా ఈ కేసుని అడ్మిట్ చేసుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణ జరుగనుంది. ఇక తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ వివాదానికి వేదికవుతోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పోటీ నుంచి తప్పుకున్నట్టు దరఖాస్తు చేశారని తెలుగుదేశం అభ్యర్థి రచ్చకెక్కడంతో వివాదం వెలుగుచూసింది. ఆయన ఫిర్యాదుపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 7వ డివిజన్ ఎన్నికను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఆక్షేపిస్తూ 7వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ నివేదిక సిద్ధం కావాల్సి ఉన్నందున కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ 13 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. దీనికి ఏడాది క్రితం మొదలై వాయిదా పడిన ఎన్నికలు ఈ నెల 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణతో మొదలైంది. ఈ నెల 3వ తేదీన కార్పొరేషన్‌ పరిధిలోని 50 డివిజన్లలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన దశలోనే ప్రత్యర్థులందరూ పోటీ నుంచి తప్పుకోవడంతో 23 డివిజన్లలో వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలేకుండా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మిగిలిన 27 డివిజన్లలో మాత్రం ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

hc 07032021 2

అయితే 7వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన విజయలక్ష్మి తాను పోటీలో నుంచి తప్పుకోలేదని, ఫోర్జరీ సంతకంతో పోటీ నుంచి విరమించుకున్నట్టుధరఖాస్తు సమర్పించారని ఫిర్యాదు చేశారు. దానిపై సానిక అధికారులు ఆమె ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించారు. స్పందించిన ఎన్నికల సంఘం కమిషనర్ 7వ డివిజన్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ సమగ్ర విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా పంపించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషాను ఆదేశించారు. ఈ వివాదంపై అవసరమైన సమాచారంతో నివేదిక పంపడంతో పాటు సంతకం అభ్యర్థి విజయలక్ష్మిదేనా కాదా అనే అంశం తేల్చడానికి ఫోరెన్సిక్ విభాగానికి కమిషనర్ గిరీషా పంపించారు. ఇదిలావుండగా ఎన్నికల సంఘం ఎన్నికను నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ 1వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్.సుజాత 5వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. సమగ్ర విచారణ నివేదిక వచ్చిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అభ్యర్థించడంతో ఈ నెల 8వ తేదీ సోమవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. ఎన్నికల చట్టం ప్రకారం దాఖలు చేసిననామినేషనను ఉపసంహరించుకునే విషయంలో అభ్యర్థి స్వయంగా కానీ, ఆ అభ్యర్ధిని ప్రతిపాదించినవారు కానీ, ఆ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కానీ ఎన్నికల అధికారిని కలిసి నిర్ణీత పద్దతిలో లేఖను సమర్పించాల్సి ఉంటుంది. 7వ డివిజన్ విషయంలో శేఖర్ అనే వ్యక్తి తనను తెలుగుదేశం అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ గా పేర్కొంటూ ఉపసంహరణ లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె ఉపసంహరించుకున్నట్టు అధికారులు నిర్ధారించుకున్నారు.

hc 07032021 3

ఆ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న అభ్యర్థి విజయలక్ష్మి తమకెవరూ ఏజెంట్ లేరని, అసలు ఉపసంహరించుకుంటున్నట్టు సమర్పించిన లేఖలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపించడంతో సమస్య మొదలైంది. వాస్తవానికి ఎన్నికల చట్టం ప్రకారం పోటీ చేసే ప్రతి అభ్యర్థి నామినేషన్ల దశలోనే తనకు ఎవరూ ఏజెంట్లు లేరని ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంది. ఈ మేరకు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో 22 మంది అభ్యర్థులు లిఖితపూర్వకంగా తమకెవరూ ఏజెంట్లు లేరని తెలియచేశారని కమిషనర్ గిరీషా చెబుతున్నారు. 7వ డివిజన్ అభ్యర్థి ఆటువంటి లేఖను సమర్పించకపోవడం కూడా సమస్యకు కారణమవుతోంది. పైగా ఉపసంహరించుకున్నట్లు సమర్పించే లేఖల్లోని అభ్యరుల సంతకాలను తమ వద్ద సంతకాలతో పోల్చిచూసి నిర్ధారించడంతో ఎన్నికల అధికారుల బాధ్యత ముగుస్తుంది. ఆసంతకం అసలైనదా, ఫోర్జరీదా తేలాలంటే 7వడివిజన్ విషయంలో జరిగినట్టు అభ్యర్థులెవరైనా అనుమానం వ్యక్తం చేసినప్పుడు చేపట్టే ప్రాథమిక పరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కోణంలో చూసినప్పుడు 7వ డివిజన్ ఎన్నికల అధికారి చట్టపరంగా వ్యవహరించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఆ లేఖ సమర్పించిన వ్యక్తిని విచారించినప్పుడు కానీ మొత్తం వివాదం వెనుక ఉన్న అంశాలన్నీ వెలుగుచూసే అవకాశం లేదనిపిస్తోంది. మరోవైపు ఈ వివాదంలో ఉన్నతాధికారులు చేపట్టిన విచారణ నివేదిక కీలకం కానున్నది. మొత్తంమీద అభ్యర్థి ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిలుపుదలచర్య నిగ్గుతేలాలంటే ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పుకోసం వేచి ఉండాల్సిందేనని స్పష్టమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read