ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణ కష్టం అని, అందుకే ఎన్నికలు వాయిదా వేయాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై , ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న విషయం పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు పేర్కొంది. క-రో-నా నేపధ్యంలో చాలా మంది అధికారులు, పోలీసులకు క-రో-నా వ్యాప్తి చెందింది. సుమారుగా 11 వేల మంది అధికారులు కానీ, పోలీసులు కానీ వైరస్ బారిన పడ్డారని, ప్రధానంగా కోర్టు దృష్టికి తెచ్చారు. అదే విధంగా గత ఏడాది ఎన్నికలు జరపాల్సిన టైంలో, వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిందని, ఇప్పుడు వ్యాప్తి ఎక్క్వుగా ఉన్న సమయంలో, ఎన్నికల నిర్వహణ కష్టం అని కోర్టుకు తెలిపారు. మరో వైపు, అక్టోబర్ లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనంతరం, కొన్ని సమీక్షలు జరిపి, అందరి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రయం ప్రకారం, ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపారు. అలాగే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే దీని పై చీఫ్ సెక్రటరీ ఉత్తరం రాస్తూ, తాము ఈ పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించలేమని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపారు. అయితే తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా, ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తుందని, అందుకే ఈ ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలని తెలిపారు.

hc 03122020 2

ప్రస్తుతం రెండో వేవ్ కూడా వస్తుందని అంటున్నారని, అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, ఈ విషయంలో తాము స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపు చేస్తాం అని, కోర్ట్ తెలిపింది. ప్రభుత్వం తరుపు సంప్రదించి మరిన్ని వివరాలు రేపు ఇస్తామని, రేపు కూడా వాదిస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పటంతో, హైకోర్టు ఒప్పుకుంది. మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు వినిపిస్తూ, బీహార్ లాంటి చోట అసెంబ్లీ ఎన్నికలే నిర్వహించారని, హైదరాబాద్ లో కూడా ఎన్నికలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కేసులు బాగా తగ్గిపోయాయని, అంతే కాకుండా చాలా రాజకీయ పార్టీలు, క-రో-నా నిబంధనలు పాటిస్తూ, ఎన్నికలు జరపటానికి అభ్యంతరం లేదని చెప్పారని తెలిపాయి. ఈ నేపధ్యంలో రేపు విచారణ వాయిదా పడటంతో, రేపు మరిన్ని వివరాలు తెలిసే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read