రాజధాని అమరావతిలో ఉన్న అసైన్డ్ రైతులకు ఈ రోజు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అంతకు ముందు, రాజధానిలో అసైన్డ్ రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 316ను తీసుకొచ్చింది. గత నెలలో ఈ జీవో జారీ చేసారు. ఈ జీవో ప్రకారం, ఎవరు అయితే అసైన్డ్ రైతులు, రాజధానికి ఇచ్చి, దానికి ప్లాట్లు తీసుకుని అమ్ముకున్నారో, ఆ భూములు తిరిగి తమకు స్వాధీనం చేయాలని, మీకు అమ్ముకునే హక్కు లేదని, అనుభవించే హక్కు మాత్రమే ఉందని చెప్పి, ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొంది. అయితే ఈ జీవో విడుదలైన తరువాత అసైన్డ్ రైతులు షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా ఎక్కువ మంది దళిత రైతులు ఉండటంతో, ఈ పరిస్థితి ఏమిటి అంటూ తల బాదుకున్నారు. అయితే ఈ జీవో పై హైకోర్ట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల తరుపున న్యాయవాది ఇంద్రనీల్ బాబు పిటీషన్ దాఖలు చేసారు. రాజధాని అనేది వీసాల ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మిస్తుందని, అందు వల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అసైన్డ్ రైతులకు కూడా క్యాటగిరీ ఫోర్ కింద అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, ప్యాకేజీలు ప్రకటించిందని, ఈ ప్యాకేజ్ ప్రకారం ఎవరు అయితే రిటర్నబుల్ ఫ్లాట్ తీసుకున్నారో, వాళ్ళ జీవనాధారం కోసం అమ్ముకున్నారని కోర్టుకు తెలిపారు.

hc 13092021 2

ఈ వాదనలు అన్నీ హైకోర్టు పరిశీలించింది. ఈ నేపధ్యంలోనే, జీవో 316 పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీని పైన తదనంతర ప్రక్రియ ఏమి చేపట్టవద్దని, యధాతధ స్థితి కొనసాగాలని, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రైతులు ఎవరు అయితే భూములు అమ్ముకున్నారో, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎవరు అయితే తీసుకున్నారో, ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ తిరిగి తమకు ఇవ్వాలని చెప్పి, ఏఏంఆర్డీఏ కొంత మంది రైతులకు నోటీసులు జారీ సెహ్సింది. దీంతో రాజధానిలో ఈ విషయం పై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలోనే జీవో 316ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు ఈ పిటీషన్ ను విచారణ చేసి, ఇరు వైపుల నుంచి వాదనలు విన్న హైకోర్టు, జీవో 316 పై స్టేటస్ కో జారీ చేసింది. అలాగే కేసు విచారణను పది రోజుల పాటు వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు అమరావతి విషయంలో, ప్రభుత్వం పన్నిన ఏ ప్లాన్ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. రాజధాని రైతుల పోరాటం ఫలిస్తు వస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read