కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్న నిధులు ఏమవుతున్నాయో, ఎలా ఖర్చు అవుతున్నాయో, వాటి వివరాలు తెలుసుకునే బాధ్యత మీ పై లేదా, దాని పై ఎలాంటి పరిశీలనా చేయరా అంటూ, కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అడవులు పరిరక్షణ కోసం, కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయిస్తుంది. అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1734.81 కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధులు కేవలం అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఉపయోగించాలి. అయితే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేరే వాటికి మళ్ళించిందని, అడవుల సంరక్షణ కోసం ఖర్చు పెట్టలేదని, ఇది కంపా చట్టానికి వ్యతిరేకం అంటూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. దీని పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది ? రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఖర్చు పెట్టిందా, లేక మళ్ళించిందా, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో చెప్పాలి అంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా తమకు అన్ని వివాలు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని, లేకపోతే ఆ శాఖకు సంబందించిన అధికారులని, కోర్టుకు పిలిపించి వివరణ అడగాల్సి వస్తుందని, హెచ్చరించింది హైకోర్టు. కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్, పూర్తి వివరాలు కోర్టుకు ఇస్తామని తెలిపారు.

hcc 28112020 2

ఇక నిన్న విచారణ జరిగిన మరో కేసు విషయంలో కూడా హైకోర్టు , కేంద్రాన్ని ప్రతి వాదిగా చేర్చలాని, కేంద్రం నుంచి కూడా సమాచారం కావాలని కోరింది. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తున్న స్థలం, గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం కోసం ఇచ్చిన భూమి అని, అందులో రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి తీసుకుని, గెస్ట్ హౌస్ నిర్మాణం జరుపుతుంది అంటూ పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఈ కేసు విషయంలో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటీషనర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ భూమి కేటాయింపు ఎలా జరిగింది, కేంద్రం ఏ ప్రాతిపదికన ఇక్కడ నిధులు ఇస్తుందో చెప్పాలి అంటూ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇక్కడ చెట్లను నరికి, చదును చేస్తున్నారని పిటీషనర్ కోర్టుకు చెప్పగా, ఇప్పటికే ఇక్కడ స్టేటస్ కో ఉంది కదా అని కోర్టు ప్రశ్నించింది. అయితే ఇక్కడ అయినా పనులు జరుగుతున్నాయని పిటీషనర్ తెలిపారు. గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం దగ్గర గెస్ట్ హౌస్ ఉంటే, ఇది దేశ భద్రతకు ముప్పు అని, దీని పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, చెట్లను నరకవద్దు అంటూ ఉత్తర్వ్యులు ఇచ్చిన హైకోర్టు, దీని పై పూర్తి స్థాయి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలనీ ఆదేశించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read