స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో, ప్రతిపక్ష నేత పేరు ఉండాలి అంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయటం లేదు అంటూ, 2019లో హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ పిటీషన్ పై గతంలో ఒకసారి విచారణ జరిగి, వాయిదా పడింది. మళ్ళీ ఈ రోజు విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు, కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ప్రతిపక్ష నేత పేరు ఉండాలి అని చెప్పి, గతంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను , రాష్ట్ర హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. సెక్యూరిటీ కమిషన్ లో, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు పేరు లేకపోవటం పై అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా, ఆయన పేరు నమోదు చేసి, నెల రోజుల్లో జీవో ఇవ్వాలి అని చెప్పి, రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ప్రతిపక్ష నేత పేరుని రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ లో చేర్చాలి అని కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఇలా చేర్చకపోవటం అనేది సుప్రీం కోర్టు తీర్పుకి ఆదేశాలకు, పూర్తిగా విరుద్ధం అని కూడా రాష్ట్ర ప్రభుత్వాని పై హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, ఈ లోపు ప్రతిపక్ష నేత పేరును, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో చేరుస్తూ, జీవో జారీ చేయాలని, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీనికి సంబంధించి, నాలుగు వారాల్లో, ఈ జీవోని రాష్ట్ర హైకోర్టుకు అందించాలని కూడా రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిసెంబర్ 26, 2019న, ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ని నామినేట్ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవోలో హోం మంత్రి, చీఫ్ సెక్రటరీ, హోం సెక్రెటరి, హెడ్ అఫ్ పోలీస్ ఫోర్సు (ఎక్ష్ ఆఫిషియో సెక్యూరిటీ), మరో ముగ్గురుని నియమిసు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆనవాయతీ ప్రకారం, అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కూడా, రాష్ట్ర ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ లో ఒక మెంబర్ గా ఉండాలి. అయితే ఈ జీవో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం లేకుండా, రాష్ట్ర ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు పేరు అందులో లేకపోవటంతో, హైకోర్టులో ఈ విషయం పై పిటీషన్ దాఖలు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించలేదని, అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో కోరటంతో, దీనికి సంబంధించి ఈ రోజు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్ర ప్రతిపక్ష నేతను స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో చేర్చి, జీవో జారీ చేయాలనీ ఆదేశాలు జరీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read