ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో ప్రధానంగా, వాలంటీర్ల వ్యవస్థ నుంచే లబ్దిదారులను ఎంపిక చేయటం పై , హైకోర్టు మౌలికమైన ప్రశ్న లేవనెత్తింది. వాలంటీర్లు వైఎస్ఆర్ చేయూత పధకం పై అర్హులైన వారికి, రాజకీయ కక్షతో అమలు కాకుండా నిలిపివేసరని చెప్పి, పెదకూరుపాడు మండలం, గార్లపాడు గ్రామస్తులు దాదాపుగా 26 మంది హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ లో గ్రామస్తుల తరుపున , న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపించారు. అయితే ఈ పిటీషన్ వేసిన తరువాత, ఆ 26 మందికి పధకం వర్తింప చేయటం పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పుడు అర్హులు కాని వారు, ఇప్పుడే ఎలా అర్హులు అయ్యారు అంటూ ప్రశ్నించింది. దీంతో వాలంటీర్లు ఏడుగురుకి, హైకోర్టు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ప్రభుత్వాన్ని కూడా, హైకోర్టు పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. వాలంటీర్లకు ఉన్న సర్వీస్ రూల్స్ ఏమిటి అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ప్రశ్నించారు. వాలంటీర్ అంటే స్వచ్చందంగా అని అర్ధం ఉంది కదా, మరి వాలంటీర్లకు జీతాలు పేరుతో డబ్బులు ఇస్తున్నట్టు, తమకు తెలుస్తుందని, వారికి డబ్బులు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

amaravati 06052022 2

పెన్షన్ సొమ్ముతో పారిపోయిన వాలంటీర్ అని ఒకసారి, శ్రీకాకుళం జిల్లాలో పత్రికల్లో వచ్చిన వార్తల పై హైకోర్టు ప్రస్తావించింది. వాలంటీర్లు ఈ విధంగా పనులు చేస్తుంటే, వారిని శిక్షించే వారు ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. వాలంటీర్లు తప్పు చేస్తే, శిక్షించే అధికారం ఎవరికి ఉందని, హైకోర్టు ప్రశ్నించింది. వాలంటీర్లు లబ్దిదారులని ఎంపిక చేయటం ఏమిటి అని ప్రశ్నించటమే కాకుండా, గ్రామ సచివాలయంలో ఎవరు అయితే సచివాలయ సిబ్బంది ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసిందో, వారి అందరూ ఏమి చేస్తున్నారని ? ఈ లబ్దిదారుల ఎంపిక చేసే విషయంలో, వారు కదా కీలక పాత్ర పోషించాల్సింది అంటూ హైకోర్టు ప్రశ్నించింది. వాలంటీర్ అనే పదం ఉన్న వ్యక్తి లబ్ది దారులను ఎలా ఎంపిక చేస్తారాని, ఈ మొత్తం సందేహాలు నివృత్తి చేయాలని, వాలంటీర్ సర్వీస్ రూల్స్ తో పాటుగా, పూర్తి స్థాయిలో నివేదిక తమకు ఇవ్వాలని, హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం పై, ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read